కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ కాలం వాడితే కంటికి ఆక్సిజన్ తగ్గుతుంది. దీని వల్ల కళ్లు పొడిబారతాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా ఈ లెన్స్ ముట్టుకుంటే కెరటైటిస్ వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లు రావచ్చు. లెన్స్ పెట్టుకుని నిద్రపోకూడడం ఏమాత్రం మంచిది కాదు.
నిజానికి కొన్ని సార్లు కాంటాక్ట్ లెన్స్, కొన్నిసార్లు కళ్లజోడు వాడడం మంచిది. ఎప్పుడూ ఒకటే కాకుండా, అవసరాన్ని బట్టి రెండింటినీ మార్చి వాడటం మంచిది. ఆఫీసులో, ఇంట్లో ఉన్నప్పుడు కళ్లజోడు పెట్టుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, బయటకు వెళ్లినప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడుకోవచ్చు.