Chair Planter: పాత, విరిగిన కుర్చీలను పడేసేకన్నా ఇలా మొక్కల కోసం వాడేయండి

Published : Jun 03, 2026, 07:06 PM IST

Chair Planter: మీ ఇంట్లో విరిగిపోయిన లేద పాత కుర్చీలు ఉన్నాయా? వాటిని బయటపడేసే బదులు  బాల్కనీ లేదా టెర్రస్ గార్డెన్‌కు సరికొత్త లుక్ తీసుకొచ్చేందుకు వాడవచ్చు. వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి.

PREV
14
పాత కుర్చీలను ఇలా వాడేయండి

ఇంట్లో పాత, విరిగిన కుర్చీలు పడి ఉంటే వాటితో మీరు అందమైన గార్డెన్ స్టాండ్‌ను తయారుచేయవచ్చు. ఈ DIY ఐడియా మీ పెరడుకు లేదా బాల్కనీకి ప్రత్యేకమైన వింటేజ్ లుక్‌ను ఇస్తుంది. పాత కుర్చీలతో గార్డెనింగ్ ఎలా చేయాలో చూద్దాం.

24
పాత కుర్చీకి కొత్త లుక్

పాత కుర్చీని శుభ్రంగా తుడవాలి. కుర్చీ సీటు పగిలిపోయినా, గరుకుగా ఉన్నా దానిపై కుండీ పెట్టడానికి వీలుగా ఒక చెక్క పలకను అమర్చాలి. సీటు పూర్తిగా విరిగిపోతే దాన్ని తీసేయండి. బాగానే ఉంటే, మధ్యలో పూల కుండీ పట్టేంత సైజులో రంధ్రం చేసి, దానిపై మీకు నచ్చిన కుండీని పెట్టుకోవచ్చు.

34
గోడపై అందంగగా
కుర్చీకి మీకు నచ్చిన రంగు వేయండి. తెలుపు, ఆకుపచ్చ, పసుపు వంటి రంగులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రంగు ఆరిన తర్వాత, పూల కుండీని సీటులో ఫిక్స్ చేయండి. అవసరమైతే, స్క్రూలు లేదా వైర్‌తో కుండీని గట్టిగా కట్టండి. రిబ్బన్లు, ఫెయిరీ లైట్లు వంటి వాటితో కుర్చీని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు.
44
మొక్కల ప్లాంటర్ గా

పాత చెక్క కుర్చీని హ్యాంగింగ్ ప్లాంటర్‌గా మార్చవచ్చు. సీటు, ముందు కాళ్లను తీసేయండి. ఇప్పుడు, కుర్చీ వెనుక భాగాన్ని గోడకు బిగించండి. చిన్న వేలాడే మొక్కలను కొక్కేలు లేదా రాడ్ల సహాయంతో వేలాడదీయండి. ఇది అందమైన, క్రియేటివ్ గార్డెన్ వాల్‌ను సృష్టిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories