Alien hand syndrome: ఈ వింత వ్యాధి వస్తే మీ చేతులు మీకు తెలియకుండానే మిమ్మల్ని చంపేసే ప్రమాదం, దీని లక్షణాలు ఇవే

Published : Sep 05, 2025, 12:56 PM IST

ఎన్నో వింత వ్యాధులు ఉన్నాయి. వాటిల్లో ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్న వారిలో చేతులు తమ వారికి తెలియకుండానే కదులుతూ ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. 

PREV
15
ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ ఇదే

ఒక మహిళ ఇంట్లో కూర్చుని హాయిగా టీవీ చూస్తోంది. కాసేపటి తర్వాత ఆమెకు ఏదో విచిత్రంగా అనిపించింది. ఆమె ఎడమ చేయి దానంతట అదే లేచి జుట్టు లాగడం ప్రారంభించింది. నిజానికి ఆ మహిళ తన చేతిని కదపాలని అనుకోలేదు. వెంటనే కుడి చేతితో ఎడమ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ రెండు చేతులు కూడా ఆమె ఆధీనంలో లేవని అర్థం అయింది. అరగంట పాటు అలా జరిగింది. వైద్యుల వద్దకు వెళితే అక్కడ ఎన్నో పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత తెలిసిందంటే ఏమిటంటే ఆమెకి ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ లేదా డాక్టర్ స్ట్రాంగేలోవ్ సిండ్రోమ్ ఉందని బయటపడింది.

25
ఈ సిండ్రోమ్ ఎంత ప్రమాదకరం?

ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ ఉంటే మెదడు వింతగా ప్రవర్తిస్తుంది. అది వచ్చిన వ్యక్తి చేతులు వాటంతట అవే కదలడం ప్రారంభమవుతాయి. అవి ఆ మనిషి ఆధీనంలో ఉండవు. చేతులపై నియంత్రణ కోల్పోవడాన్నే ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఆ చేతులు తమకు తాముగా నచ్చిన పనులను చేసేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ చేతులు ఆ మనిషిని చంపేయగలవు కూడా. ఏదైనా పదునైన వస్తువులతో మీ శరీరాన్ని హానిపరిచే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వింత వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు

35
ఈ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి?

ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తి చేతులు వింతగా ప్రవర్తిస్తాయి. రోజంతా ఈ లక్షణాలు కనిపించక్కర్లేదు... కానీ రోజులో ఎంతో కొంత సేపు తమకు నచ్చిన పనులు చేసేస్తూ ఉంటాయి. వాటిని నియంత్రించడం మనిషి వల్ల కాదు. మీరు వేసుకున్న బట్టలను విప్పడం లేదా సిగరెట్ వెలిగించడం, మీ చెంపలపై కొట్టడం లేదా ఎదుటి వారిపై చెంపలపై కొట్టడం వంటివి కూడా చేస్తాయి.

45
ఎందుకు వస్తుంది?

మెదడులో రక్త సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు ఇలాంటి ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ వంటివి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏలియన్ హాండ్స్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పడం కష్టం. మెదడుకు గాయం తగిలినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, మూర్ఛలు, అల్జిమర్స్ వంటి నరాల వ్యాధులు వచ్చినప్పుడు ఇది జరగవచ్చు. 2013లో ప్రపంచవ్యాప్తంగా 150 మందికి ఈ ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ ఉన్నట్టు తెలిసింది.

55
చికిత్స ఉందా?

ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ వచ్చిన వారికి చికిత్స ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. మొట్టమొదటిసారిగా 1908లో దీన్ని గుర్తించారు. ఇప్పటికీ వైద్యులు దీనికి తగిన మందులను కనిపెట్టలేకపోతున్నారు. కాకపోతే ఇది చాలా అరుదుగా తక్కువ మందిలో వస్తుండడంతో దీనిపై ఎక్కువ దృష్టిని పెట్టడం లేదు. కానీ ఈ వ్యాధి బారిన పడిన వారు మాత్రం ఎంతో ఇబ్బంది పడతారు. పదిమందిలో ఉండలేక బయటకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు.

Read more Photos on
click me!

Recommended Stories