Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?

Published : Feb 05, 2026, 11:30 AM IST

 Child Psychology: ఈ రోజుల్లో మద్యం సేవించడం అనేది చాలా కామన్ అయిపోయింది. సోషల్ స్టేటస్ కోసం మందు తాగేవారు కూడా ఉంటారు. అయితే, ఈ పని పిల్లల ముందు చేస్తే ఏమౌతుంది? దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? 

PREV
13
Parenting Tips

పిల్లల ముందు తండ్రి మద్యం సేవించడం అనేది కేవలం ఒక వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, అది పిల్లల మానసిక ఎదుగుదలపై, భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు తమ తండ్రిని మొదటి హీరోగా, రోల్ మోడల్ గా భావిస్తారు. అలాంటి తండ్రే వారి ముందు మందు తాగితే కలిగే పరిణనామాలు ఇవే..

23
1.మద్యం తాగడం చాలా కామన్ అనే ఫీలింగ్..

పిల్లల ముందు మద్యం తాగుతుంటే, మద్యం సేవించడం అనేది టీ లేదా కాఫీ తాగడం లాంటి ఒక సాధారణ విషయం అని వారు భావించడం మొదలుపెడతారు. దీని వల్ల పిల్లలు టీనేజ్ వయసు దాటిన దగ్గర నుంచే మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉంది.

2.తండ్రిపై గౌరవం తగ్గడం...

మద్యం సేవించిన తర్వాత తండ్రి ప్రవర్తనలో మర్పు రావడం పిల్లలు గమనిస్తారు. ఇది వారి మనసులో తండ్రి పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. తండ్రిని చూసి భయపడటం లేదా.. అసహ్యించుకోవడం మొదలుపెడతారు.

33
3. మానసిక ఒత్తిడి , అభద్రతా భావం

తండ్రి తాగినప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతాయేమో అనే భయం పిల్లల్లో నిరంతరం ఉంటుంది. దీనివల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. బయట ఎవరితోనూ తమ ఇంటి విషయాలు చెప్పుకోలేక కుంగిపోతారు. ఇది వారి చదువుపై , ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది.

4. భావోద్వేగ దూరం

మద్యం మత్తులో ఉన్న తండ్రి పిల్లలతో నాణ్యమైన సమయాన్ని (Quality Time) గడపలేరు. పిల్లలు తమ మనసులోని మాటలు చెప్పుకోవాలన్నా, హోంవర్క్ చేయించుకోవాలన్నా తండ్రి దగ్గరకు వెళ్లడానికి జంకుతారు. దీనివల్ల తండ్రి-పిల్లల మధ్య బంధం బలహీనపడుతుంది.

5. ప్రవర్తనా సమస్యలు

పిల్లల ముందు తాగే తండ్రులు ఉన్న ఇళ్లలో పెరిగే పిల్లలు భవిష్యత్తులో మొండిగా మారడం, అబద్ధాలు చెప్పడం లేదా దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

పిల్లలు మీరు చెప్పే మాటల కంటే, మీరు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే, వారి ముందు ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే పిల్లలు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories