ఎంత వాకింగ్ చేసినా బరువు తగ్గడం లేదా? కారణమేంటో తెలుసా?

First Published | Nov 16, 2024, 4:30 PM IST

వాకింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం రోజూ నడిచేవారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది ఎంత నడిచినా బరువు మాత్రం తగ్గరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే? 


రోజూ వాకింగ్ చేయడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. వాకింగ్ బరువు తగ్గడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడికి కూడా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అయితే చాలా మంది బరువు తగ్గడానికని ప్రతిరోజూ వాకింగ్ చేస్తుంటారు. కానీ బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. అసలు వాకింగ్ చేసేటప్పుడు మీరు చేసే కొన్ని తప్పుల వల్లే బరువు తగ్గరని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


walking

తప్పుగా నడవడం 

వాకింగ్ చేసినా బరువు తగ్గకపోవడానికి మీరు తప్పుగా నడవడం ఒక కారణమంటున్నారు నిపుణులు. చాలా మంది వాకింగ్ చేసేటప్పుడు కాళ్లను పూర్తిగా కదిలించరు. దీనివల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ కావు. అలాగే బరువు కూడా తగ్గరు. ముఖ్యంగా చాలామంది వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ వైపు చూస్తుంటారు. దీనివల్ల మెడ, భుజం నొప్పి కలుగుతాయి. కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి లాభం లేకపోగా.. ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. 

స్లో స్పీడ్

నెమ్మదిగా నడిచినా కూడా మీరు బరువు తగ్గే ఛాన్స్ ఉండదు. దీనివల్ల కేలరీలు బర్న్ కానేకావు. చాలా మంది నెమ్మదిగా నడిచి బరువు తగ్గడం లేదని చెప్తుంటారు. మీరు స్లో గా నడిస్తే బరువు తగ్గే అవకాశం ఉండదు కాబట్టి స్పీడ్ గా నడిచే ప్రయత్నం చేయండి. 
 

రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లకపోవడం

కొంతమంది గుర్తొచ్చినప్పుడు లేదా రెండు మూడు రోజులకోసారి వాకింగ్ కు వెళుతుంటారు. ఇలాంటి వారు కూడా ఎంత వాకింగ్ చేసినా అస్సలు బరువు తగ్గరు. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా నడవకపోవడం వల్ల మీరు బరువు తగ్గడానికి అవసరమైన క్యాలరీలను  బర్న్ చేసే అవకాశం మీ శరీరానికి లభించదు. దీనివల్ల మీరు బరువు తగ్గరు. కాబట్టి ప్రతిరోజూ 30 నిమిషాలైనా వాకింగ్ చేయండి. 

తప్పుడు పోషణ

వాకింగ్ తో పాటుగా మీరు బరువు తగ్గాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు వాకింగ్ చేసిన తర్వాత కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్, జంక్ ఫుడ్ ను తీసుకుంటే మీ బరువు పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు పండ్లను, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినండి. 
 

నీళ్లు తాగకపోవడం 

నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. తగినన్ని నీళ్లను తాగకపోతే మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మీరు బరువు తగ్గే అవకాశం ఉండదు. అందుకే బరువు తగ్గాలంటే మీరు నీళ్లను పుష్కలంగా తాగడంతో పాటుగా కొబ్బరి నీళ్లు, జ్యూస్ లను ఎక్కువగా తాగండి. దీనివల్ల మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. 

ఒకే చోట నడవడం

ఒకేచోట నడిచినా మీరు బరువు తగ్గరు. దీనివల్ల మీ శరీరం  ఒకే రకమైన కండరాలను ఉపయోగిస్తుంది. దీంతో మీరు బరువు తగ్గరు. అందుకే వేరే వేరే మార్గాల్లో నడవండి. వివిధ రకాల ఉపరితలాలపై వాకింగ్ చేయండి. దీనివల్ల మీ శరీరంలోని వివిధ కండరాలకు వ్యాయామం అవుతుంది. అలాగే మీరు బరువు కూడా తగ్గుతారు. 

click me!