Kitchen Waste: ఇంట్లో మొక్కలు పచ్చగా పెంచేందుకు పెద్దగా కష్టపడక్కర్లేదు. మొక్కలు బాగా పెరగాలంటే, వంటగదిలోని కొన్ని వ్యర్థాలను వాటికి వేస్తే చాలు. ప్రత్యకంగా ఎరువులు కొనాల్సిన అవసరం లేదు.
అరటి పండు తినేశాక ఆ తొక్కలను మొక్కల మట్టిలో వేసేయండి. మొక్కలు సులువుగా పెరిగేందుకు అరటి తొక్క మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఈ అరటితొక్కలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొక్కల ఎదుగుదలకు చాలా అవసరం.
25
కాఫీ పొడి
ఇంట్లో ఉండే కాఫీ పొడిని చల్లడం ద్వారా మొక్కలు పచ్చగా పెరుగుతాయి. మొక్కల చుట్టూ కాఫీ పొడి చల్లడం వల్ల మట్టిలో తేమ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మొక్కలకు అవసరమైన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.
35
కూరగాయల తొక్కలు
చాలా కూరగాయలను పైన తొక్కతీసి వండుతాం. బంగాళదుంప, క్యారెట్, దోసకాయ, అరటి కాయ ఇలా తీసిన పొట్టును మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. వీటిలో మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
గుడ్డు పెంకుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని పొడిగా చేసి మొక్కల చుట్టూ వేస్తే చాలు. మొక్కలు చాలా సులభంగా, బలంగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్లు లేదా గంజి మొక్కలకు మంచి ఎరువులా పనిచేస్తుంది. ఇందులో ఉండే స్టార్చ్ మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
55
వాడిన టీ పొడి
ప్రతి ఇంట్లోనూ టీ తాగే వారి అధికమే. వాడేసిన టీ పొడిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఇది మట్టిలో తేమను నిలిపి ఉంచడానికి బాగా సహాయపడుతుంది.