డబ్బులు సంపాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా చాలా మంది తమ రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కష్టపడుతుంటారు. అలా కష్టపడి సంపాదిస్తారు. అయితే.. డబ్బు సంపాదించగానే సరిపోదు.. దానిని నిలపెట్టుకోవాలి. నిల పెట్టుకోవాలంటే ఆదా చేయాలి. డబ్బు చాలా మంది సంపాదిస్తారు.. కానీ.. సంపాదించిన దానిని ఆదా చేయడం కూడా తెలిసిన వారే ఐశ్వర్యవంతులౌతారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో క్లారిటీ ఉండి.. సరిగా ఆదా చేస్తే... మనం కూడా ధనవంతులమవ్వచ్చు. అయితే.. చాలా మందికి డబ్బు ఆదా చేయాలనే ఉన్నా.. ఎలా చేయాలో తెలియక సతమతమౌతుంటారు. అందుకే.. ఎలా డబ్బులు ఆదా చేయాలో ఇప్పుడు నిపుణులు మనకు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి మనమూ చూసేద్దామా..