ఉడకపెట్టిన బంగాళదుంపలు..
కూరలో ఉప్పు ఎక్కువైతే సరిచేయడానికి ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు లేదా గుజ్జు వేస్తే చాలు. బంగాళాదుంప అదనంగా ఉన్న ఉప్పునంతటినీ పీల్చేస్తుంది. గ్రేవీ కాస్త చిక్కబడితే కొద్దిగా నీళ్లు కలిపి మీకు కావలసిన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవచ్చు.
గోధుమపిండి ఉండలు..
తరతరాలుగా మన ఇళ్లలో వాడే బెస్ట్ కిచెన్ హ్యాక్ ఇది. కొద్దిగా గోధుమపిండిలో నీళ్లు పోసి, చిన్న చిన్న ఉండలుగా చేసి ఉప్పు ఎక్కువైన కూరలో వేయాలి. ఇవి ఉప్పును పీల్చుకున్నాక, వడ్డించే ముందు ఆ పిండి ఉండలను బయటకు తీసేస్తే సరిపోతుంది.
సలాడ్లు, పులావ్ లేదా బిర్యానీ లాంటి వాటిల్లో ఉప్పు, కారాలు ఎక్కువైతే పాలు లేదా బంగాళాదుంప గుజ్జు కలపలేం కదా.. అలాంటప్పుడు సలాడ్లో ఉప్పు లేని పాలకూర, లెట్యూస్ ఆకులు లేదా అదనపు కూరగాయ ముక్కలు కలపాలి. పులావ్ అయితే కొద్దిగా ఉప్పు లేని సాదా అన్నాన్ని లేదా ఉడకబెట్టిన కూరగాయలను కలిపి తిప్పితే కారం, ఉప్పు తగ్గుతాయి.