బ్లాక్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి.. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. జన్యులోపం, డ్రై స్కిన్, కళ్ల నుంచి ఎక్కువగా నీళ్లు కారడం, వృద్ధాప్యం, కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడం, శారీరకంగా, మానసిక ఒత్తిడికి గురికావడం, నిద్రలేమి సమస్య, పోషకాహార లోపం వంటివి బ్లాక్ సర్కిల్స్ కు కారణాలుగా చెప్పవచ్చు.