గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ.. ఈ రెండింటిలో ఏది తాగితే వేగంగా బరువు తగ్గుతారో తెలుసా..?

Published : Apr 13, 2022, 09:41 AM IST

గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ.. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా.. బరువు తాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
18
గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ.. ఈ రెండింటిలో ఏది తాగితే వేగంగా బరువు తగ్గుతారో తెలుసా..?

ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య సర్వ సాధారణం అయిపోయింది. ఈ సమస్య నుంచి బయటయటపడేందుకు ఎన్నో టిప్స్ ను ఫాలో అవుతుంటారు. అయితే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగితే సులభంగా బరువు తగ్గుతారని వైధ్య నిపుణులు చెబుతుంటారు. 

28

పంచదార, పాలు లేకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు అనేది నిపుణుల మాట. అయితే గ్రీన్ టీ లేదా.. బ్లాక్ కాఫీలో ఏది బెటర్.. ఏది తాగితే తొందరగా బరువు తగ్గుతారన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

38

బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ .. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండు మన ఆరోగ్యానికి మంచి చేసే గుణాలను కలిగి ఉన్నాయి. ఈ బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ.. ఇవి వెయిట్ తగ్గేందుకు , జీవక్రియను పెంచేందుకు బాగా సహాయపడతాయి. మరి ఈ రెండింటిలో ఏది తొందరగా బరువు తగ్గిస్తుందో తెలుసా..

48

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగితే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, కెఫిన్ వెయిట్ తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. 
 

58

గ్రీన్ టీలో మెగ్నీషియం, విటమిన్ బి, ఫ్లేవనాయిడ్స్, ఫోలెట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ టైప్ 2 డయాబెటీస్ ను , గుండె సంబంధిత రోగాలను, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 

68
black coffee

పాలు, పంచదార లేని ఫిల్టర్ కాఫీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ రేటును పెంచడంతో పాటుగా వెయిట్ ను కూడా తగ్గిస్తాయి. 

78

బ్లాక్ కాఫీలో పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5 , మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగితే వేగంగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది. కానీ కెఫిన్ మోతాదుకు మించితే నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. 
 

88

ఫైనల్ గా బ్లాక్ కాఫీ.. గ్రీన్ టీలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్ అన్న దానిపై నిపుణులు ఒక సలహా ఇస్తున్నారు. ఈ రెండింటిలో గ్రీన్ టీ తాగితేనే బరువు వేగంగా తగ్గుతారని తెలుపుతున్నారు. ఎందుకంటే గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కొన్ని రకాల ఇతర పదార్థాలు బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీకే ప్రధాన్యత ఇవ్వండి.   

 

click me!

Recommended Stories