వానాకాలం, చలికాలంలో కంటే ఒక్క ఎండాకాలంలోనే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎందుకంటే మండుతున్న ఎండల వల్ల ఇల్లు నిప్పుల కుంపటిలా మారుతుంది. ఇల్లు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. దీనికోసం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పొద్దంతా నడుస్తూనే ఉంటాయి. కానీ వీటివల్ల కరెంట్ బిల్లు మాత్రం తడిసి మోపెడు అవుతుంది. మరి ఈ సీజన్ లో కరెంట్ బిల్లును తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.