చీమలు, బొద్దింకలు బయటకు పోవాలంటే?
ఇంట్లో చీమలు, బొద్దింకలు అంత సులువుగా బయటకు పోవు. అయితే మీరు వీటిని చాలా సులువుగా బయటకు పోగొట్టే మార్గం ఒకటి ఉంది.బోరాక్స్, బేకింగ్ సోడాతో ఇవి ఇంట్లో ఒక్క క్షణం లేకుండా చేయొచ్చు. ఇందుకోసం బోరాక్స్, బేకింగ్ సోడాను బ్రెడ్ ముక్కలతో మిక్స్ చేసి చీమలు, బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. ఇది మనుషులకు ప్రమాదకరం కాదు. కానీ ఇది బొద్దింకలు చనిపోయేలా చేస్తుంది. కానీ ఇది ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులకు చాలా ప్రమాదకరం. అందుకే ఇక్కడికి అవి రాకుండా చూసుకోవాలి.