Potato Paneer: పొటాటో పన్నీర్ .. అదిరిపోయే ఈవినింగ్ హెల్దీ స్నాక్స్ రెసిపీ మీకోసం?

First Published Jun 24, 2023, 1:38 PM IST

Potato Paneer: ఠారెత్తించే ఎండలు ఇప్పుడిప్పుడే బై బై చెప్పి సన్నని వర్షాలు మొదలవుతున్నాయి. దీంతో వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించడం సహజం. టేస్ట్ తో పాటు న్యూట్రీషియన్ వాల్యూస్ కూడా ఉన్న స్నాక్ పొటాటో పన్నిర్ చిల్లి పకోడా ట్రై చేద్దాం రండి.

ముందు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తర్వాత దీని న్యూట్రీషియన్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. ఈ రెసిపీ కోసం ఉడికించిన బంగాళదుంపలు నాలుగు, పచ్చిమిర్చి 250 గ్రాములు, పన్నీరు తురుము అరకప్పు, శనగపిండి 150 గ్రాములు, బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్,
 

ఉప్పు తగినంత, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, నూనె ఫ్రై కి సరిపడినంత. ముందుగా బంగాళాదుంపలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక పాత్రలో పన్నీర్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు.
 

Latest Videos


పచ్చిమిర్చి వేసి అందులో మిగిలిన ఇంగ్రిడియంట్స్ కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి వీటికి అవసరం అయితేనే తగినంత నీరు జోడించండి సాధారణంగా నీరుఅవసరం పడదు. ఈ మిశ్రమాన్ని పకోడీ లాగా అయినా వేయొచ్చు కట్లెట్స్ లాగా అయినా వేయొచ్చు లేదంటే మీకు నచ్చిన ఏ షేపులో అయినా చేసి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
 

దీనిని చిల్లీ సాస్ తో తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం. పన్నీర్ లో ఉండే ప్రోటీన్లు మంచి శక్తిని ఇస్తాయి. ఇందులో ఉండే ఫాస్ఫరస్, పాస్ఫేట్ జీర్ణ క్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. పన్నీర్లో ఉండే జింకు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి జీర్ణ క్రియలకు, షుగర్ ని కంట్రోల్ లో చేయటానికి ఉపయోగపడుతుంది.
 

పన్నీర్ లో ఉండే పొటాషియం కండరాలికి బ్రెయిన్ కి ద్రవ నియంత్రణ పదార్థంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్నాక్ రుచికి కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక బంగాళదుంప పిల్లలకి అతి ఇష్టమైన ఫుడ్ కాబట్టి ఈ కాంబినేషన్లో రెసిపీ చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.

click me!