ఇంట్లో గరం మసాలా ఎలా చేయాలి?

First Published | Jun 28, 2024, 10:14 AM IST

గరం మసాలాను ప్రతి ఒక్కరూ వాడుతారు. ముఖ్యంగా గరం మసాలాను చికెన్, మటన్ వంటి మాంసాహారాల్లో ఎక్కువగా వాడుతుంటారు. అయితే చాలా మంది గరం  మసాలాను మార్కెట్ లోనే కొంటుంటారు. కానీ మీరు ఇంట్లోనే చాలా ఈజీగా దీన్ని తయారుచేయొచ్చు. అదెలాగంటే? 

ఒక్క చికెన్, మటన్ లోనే కాకుండా పప్పులు, కూరగాయల్లో కూడా వివిద రకాల మసాలా దినుసులతో చేసిన గరం మసాలాను వేస్తుంటారు. దీనివల్ల కూరలు మరింత టేస్టీగా అవుతాయి. చాలా మటకు గరం మసాలాను మార్కెట్ లోనే కొంటుంటారు. కానీ మీరు చాలా సులువుగా దీన్ని మీ ఇంట్లోనే చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


గరం మసాలాకు కావాల్సిన పదార్థాలు

జీలకర్ర - 1/4 కప్పు
నల్ల మిరియాలు - 1/4 కప్పు
యాలకులు - 2-3
ధనియాలు - 1/2 కప్పు
ఎండుమిర్చి - 3-4
జీలకర్ర - 2-3 టీస్పూన్లు
లవంగాలు - 6
దాల్చిన చెక్క - 3-4 కర్రలు
జాజికాయ పొడి - 1/2 టీస్పూన్
బిర్యానీ ఆకులు - 2-3
అల్లం పొడి - 1 టీస్పూన్
 


గరం మసాలాను తయారుచేసే విధానం

ముందుగా ఒక పాన్ తీసుకుని వేడి చేయండి.  బాణలీ వేడెక్కిన తర్వాత దాంట్లో ధనియాలు వేసి కాసేపు వేయించండి. ఇవి మొత్తం వేగిన తర్వాత బాణలీలో నుంచి వాటిని తీసేసి జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి క్రిస్పీ అయ్యే వరకు వేయించండి.

garam-masala

ఇప్పుడు జాజికాయ, అల్లం వేసి మిగిలిన మసాలా దినుసులన్నింటినీ కాసేపు వేయించండి. అయితే ఈ మసాలా దినుసులు మాడిపోకుండా చూసుకోవాలి. మసాలా దినుసుల నుంచి రావడం మొదలైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సర్ జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు అన్నింటినీ పౌడర్ లా చేయండి. దీంట్లో జాజికాయ, అల్లం పొడిని వేసి కలపండి. అంతే గరం మసాలా రెడీ. ఇది తొందరగా చెడిపోకూడదంటే దీన్ని గాలి వెళ్లని డబ్బాలో వేసి నిల్వ చేయండి.      

Latest Videos

click me!