అమ్మమ్మలు చెప్పినట్టు ఇలా చేస్తే నెల రోజుల్లో వెంట్రుకలు నడుము వరకు పెరుగుతాయి

First Published Jun 20, 2024, 1:50 PM IST

అమ్మమ్మలు చెప్పే చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దగ్గు, జలుబు నుంచి జుట్టు పెరగడం వరకు వీళ్లు చెప్పిన చిన్న చిన్న విషయాలను పాటిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. 
 

అందమైన, ఒత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం రకరకాల షాంపూలు పెట్టడం, నూనెలను వాడటం, పార్లర్ కు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ వీటిని వాడిన తర్వాత జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది. అలాగే జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. మనం తినే ఆహారం, జీవనశైలి, రసాయనాలతో నిండిన ఉత్పత్తులను వాడటం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అయితే జుట్టును రాకుండా చేయడానికి అమ్మమ్మలు చెప్పిన చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 
 

జడను అల్లండి

చాలా మంది అమ్మాయిలు జుట్టును ఎక్కువగా లీవ్ చేస్తుంటారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు. కానీ ఇలా జడ అల్లకండా లీల్ చేస్తే జుట్టు ఆకృతి మారుతుంది. అలాగే జుట్టు మూలాలు కూడా బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు మునపటి కంటే ఎక్కువగా రాలుతుందని చాలా మంది నమ్ముతారు.
 

నిజమేంటంటే? జుట్టును ఎప్పుడూ లీవ్ చేయడం వల్ల అవి మరింత చిక్కుబడిపోతాయి. అలాగే వెంట్రుకల చివర్లు విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మీరు జడను అల్లడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని అమ్మమ్మలు చెప్తారు. దీనివల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. ఇది కేవలం చెప్పిన మాటే కాదు చాలా అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. అందుకే వారానికి కొన్ని రోజులు జుట్టును అల్లడానికి ప్రయత్నించండి. 

అమ్మమ్మ లేదా నానమ్మ జుట్టు బాగా నూనె పెట్టి జడను అల్లమని చెప్తుండటాన్ని వినే ఉంటారు. నిజంగా ఈ చిట్కా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నూనెతో జుట్టుకు మసాజ్ చేసి ఆ తర్వాత జడ వేసుకుంటే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అయితే జడను మరీ టైట్ గా అల్లకూడదు. దీనివల్ల వెంట్రుకలు లాగి తెగిపోతాయి. జుట్టు కట్టేటప్పుడు టైట్ రబ్బర్ బ్యాండ్స్ ను వాడకూడదు. 
 

hair care


రోజూ నూనె పెట్టి జడను వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు నూనె వాడకుండా జడను అల్లుకోవచ్చు.  కానీ వారానికి ఒకసారైనా ఇలా చేయండి. నూనె రాసుకున్న తర్వాత జుట్టు కట్టుకుంటే ఆ నూనెలోని పోషకాలన్నీ జుట్టుకు చేరవు.  దీని వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. దీనితో పాటు నిద్రపోయే ముందు జడను అల్లండి. ఓపెన్ హెయిర్ లేదా బన్ తో నిద్రపోవడం వల్ల జుట్టుపై ఒత్తిడి పెరిగి రాలిపోవడం ప్రారంభమవుతుంది.

Latest Videos

click me!