Home decoration: చిన్నగా ఉన్న ఇంటిని అందంగా ముస్తాబు చేయడం ఎలాగో తెలుసా?

First Published Jan 18, 2022, 3:54 PM IST


Home decoration: కొన్ని కొన్ని సార్లు చిన్నగా ఉన్న ఇంటిని అందంగా చక్కదిద్దుకోవడం పెద్ద తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అరె ఇంత చిన్నగా ఉన్న ఇల్లును కూడా చక్కగా ఉంచుకోలేనా అని తెగ ఇదై పోతుంటారు. చిన్న ఇంటిని ఎలా అందంగా తయారుచేయాలో ఎక్కడా పాలుపోవడం లేదా.. అయితే ఈ ఆర్టికల్ ద్వారా మీ ఇంటని అందంగా ముస్తాబు చేయండి.

Home decoration: పెద్దగా ఉన్న ఇంట్లో ఎన్ని వస్తువులనైనా పెట్టి మనకు నచ్చిన రీతిలో అందంగా తయారుచేసుకోవచ్చు. కానీ చిన్నగా ఉన్న ఇంటిని అందంగా ముస్తాబు చేయాలంటే కష్టంతో కూడుకున్నపనే. ఎందుకంటే చిన్న ఇంట్లో సామాన్లు ఎన్నో ఉంటాయి. వాటన్నింటిని ఒక క్రమపద్దతి ప్రకారం పెట్టుకుని.. ఇంటిని చక్కగా అలంకరణ చేసుకోవాలంటే ఎంతైనా కష్టమే. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో చిన్న ఇంటిని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేయొచ్చని. దానికోసం మీరు ఏం చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

ముందుగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని వస్తువులను నేలపై ఉంచకపోవడమే. మనం ఎంత చిన్న ఇంటిలో ఉన్నా.. వస్తువులను నేలపై పెడితే చూడటానికే కాదు.. నడవడానికి కూడా మనకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకే వస్తువును పెట్టడానికి స్టాకింక్ బోర్డులు లేదా డిస్పోజబుల్ అల్మారాలను, లేదా షెల్ఫ్ లను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. అలాగే Electric lights కు బదులుగా నేలపై స్కాన్ ల్యాంప్స్ ను పెడితే ఇల్లు మరింత అందంగా అద్బుతంగా మారిపోతుంది. 

 మనం ఎక్కువగా ఉపయోగించే డెస్క్ లేదా డైనింగ్ టేబుల్ లు బదులుగా ఫోల్టబుల్ ఫోనీటైల్ వస్తువులను ఉపయోగించడం బెటర్. ఎందుకంటే ఇంట్లో తక్కువ స్థలం ఉన్నప్పుడు ఈ ఫోల్టబుల్ ఫోనిటైల్ వస్తువులను కొనడం ఉత్తమం. ఎందుకంటే వీటిని అవసరమైనప్పుడు వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. లేదంటే వాటిని మడవచ్చొ. అప్పుడు ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. 

ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు కిటికీలు తక్కువ మొత్తంలో ఉండటం మనం చూస్తున్నదే. దాంతో కిటికీలు లేని గదులు చిమ్మ చీకటిగా కనిపిస్తాయి. అలాంటప్పుడు electric lights తో ఆ గదిని అందంగా ముస్తాబుచేయవచ్చు. ఇంటి పైకప్పు పైకి ఎత్తుగా ఉంటే లాకెట్టు దీపాన్ని వేలాడదీసి అందంగా తయారుచేయవచ్చు. అలాగే టేబుల్ ల్యాంప్ లు పెట్టడం వల్ల ఇల్లు సరికొత్త కళను సంతరించుకుంటుంది. అందులోనూ విద్యుత్ కాంతులతో గది చకచకమెరిపోతూ ఉంటుంది. 

మాములుగా ఇంటి గోడలకు ఎక్కువగా సున్నాన్నే వేస్తుంటారు. అయితే ఇల్లు చిన్నదిగా ఉన్నప్పుడు గోడలకు సున్నానికి బదులుగా డిఫరెంట్ కలర్స్ లలో గోడలకు పెయింట్ వేయండి. ఇలా చేయడం వల్ల ఇల్లు మరింత అందంగా మారుతుంది. అయితే పై కప్పులకు బోల్డ్ కలర్స్ ను వేయడం వల్ల అది ఒక అందమైన గదిలా మెరిసిపోతుంది. అయితే వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఒకే ప్లేస్ లో ఉండేలా చూసుకోవాలి.  

ఎక్కువగా ఉపయోగించని వస్తువులను షెల్ఫ్ పైన పెట్టుకోవడం బెటర్. అలాగే ఫర్నీచర్ ను ఒకదానికొకటి తగిలేలా పెట్టకండి. దీనివల్ల స్థలం సరిపోదు. అందుకే ఫర్నీచర్ ను కొంచెం గోడకు ఆనించి కాస్త స్థలం వదలండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తక్కువ స్థలం లో కూడా ఇరుకు ఇరుకుగా వస్తువులను పెట్టకూడదు. ఇలాపెడితే మొత్తం గందరగోలంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైన వస్తువును తీసేటప్పుడు చేతు తగిలి వేరే వస్తువులు కింద పడే ప్రమాదం ఉంది. 

click me!