ఫ్రిజ్ లేకుండా నీళ్లను చల్లగా ఉంచడానికి ఏం చేయాలి?

First Published | Apr 9, 2024, 11:50 AM IST

ఎండాకాలం ఉక్కపోతల వల్ల నీళ్లు తొందరగా వేడిగా అవుతుంటాయి. అయితే ఫ్రిజ్ లేని వారు కొన్ని సింపుల్ ట్రిక్స్ తో నీళ్లను చాలా చల్లగా, ఫ్రిజ్ వాటర్ లా చేయొచ్చు. ఇందుకోసం ఏ చేయాలంటే?
 

ఎండాకాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ నే ఎక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే కూల్ వాటర్ తాగిన దాకా మన దాహం తీరదు. అయితే కొంతమంది ఫ్రిజ్ వాడరు. ఇలాంటి వారు ఫ్రిజ్ వాటర్ లా చల్లగా ఉండటానికి ఏమేమి చేయొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కుండ నీరు 

ఎండాకాలంలో కుండలు బాగా దొరుకుతాయి. కుండలో నీళ్లు పోస్తే చల్లగా అవుతాయి. ఈ వాటర్ కిందికి ఫ్రిజ్ వాటర్ కూడా పనికిరాదు. నిజానికి ఫ్రిజ్ వాటర్ కంటే కుండ నీళ్లే మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ వాటర్ చాలా టేస్టీగా కూడా అవుతాయి. 

Latest Videos


నీళ్ల బాటిల్ చుట్టు గుడ్డ

మీరు నీళ్లు పోసిన బాటిల్ లేదా బిందె చుట్టు ఒక కాటన్ క్లాత్ ను రెండు మడతలు చేసి చుట్టూ కట్టండి. దీన్ని తడపండి. దీనివల్ల నీల్లు చల్లగా ఉంటాయి. అలాగే మీకు ఎలాంటి హాని కూడా జరదదు. ఈ పద్దతి కూడా నీళ్లను కూల్ గా ఉంచుతుంది. 
 

ఐస్ బాక్స్ 

ఎండాకాలలో నీటిని చల్లగా ఉంచడానికి మీరు ఐస్ బాక్స్ లను కూడా ఉపయోగించొచ్చు. ఐస్ బాక్స్ లో వాటర్ బాటిల్స్ ను పెట్టండి. దీనివల్ల వాటర్ చల్లగా అవుతుంది. 

రాగి సీసాలో వాటర్

రాగి సీసా కూడా నీళ్లను కూల్ గా ఉంచుతుంది. రాగి సీసాలో నీళ్లను పోస్తే అవి తొందరగా వేడి అవ్వవు. దీనిలో నీళ్లు పోసిన తర్వాత తడి గుడ్డను చుట్టూ కట్టండి. దీనివల్ల నీళ్లు చాలా సేపటి వరకు చల్లగా ఉంటాయి. 

ఇన్సులేటెడ్ బాటిల్ 

ఎండాకాలంలో మీరు నీళ్లను చల్లగా ఉంచడానికి ఇన్సులేటెడ్ బాటిల్స్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇది ఎండాకాలంలో ఎక్కువసేపు నీటిని చల్లగా ఉంచుతుంది.
 

కూలింగ్ ఫ్యాన్ 

వాటర్ బాటిల్ లేదా నీటి బిందెను ఇంట్లో చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టండి. దాని ముందు కూలింగ్ ఫ్యాన్ నడిచేలా చూడండి. దీనివల్ల నీళ్లు ఎక్కువ సేపు చల్లగా ఉంటాయి.

మట్టి బాటిల్ 

మీరు బయట పనిచేస్తున్నట్టైతే గనుకు ప్లాస్టిక్ బాటిల్ ను అస్సలు ఉపయోగించకండి. దీనికి బదులుగా మీరు  మట్టి బాటిళ్లను ఉపయోగించండి. దీనివల్ల నీళ్లు చల్లగా ఉంటాయి. అలాగే వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

click me!