ఇంట్లోకి ఈగలు రాకూడదంటే ఏం చేయాలి?

First Published | Apr 16, 2024, 8:56 AM IST

ఎండాకాలం స్టార్ట్ కాగానే ఇంట్లోకి ఈగలు బారులు కడుతుంటాయి. ఇళ్లంతా ఈగలతో నిండిపోతుంటుంది. ముఖ్యంగా ఎక్కడైన చక్కెర కానీ, బెల్లం కానీ ఉందంటే దానిచుట్టే ఉంటాయి. అయితే మీరు కొన్ని మొక్కలు పెంచుకుంటే మీ ఇంట్లోకి ఒక్క ఈగ కూడా రాదు. 
 

ఇండ్లలో ఈగలు ఉండటం చాలా కామన్. వానాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలోనే ఈగలు ఇంట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఈగలు తినే ఆహారాలపై వాలుతాయి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వాలుతుంటాయి. వీటి వల్ల చిరాకే కాదు ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి. ఇవి రాకుండా ఉండేందుకు ఎన్నో చేస్తుంటారు. అయినా ఈగలు రావడం మాత్రం ఆగదు. అసలు ఈగలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

FLY


ఈగలను తరిమికొట్టే మొక్కలు ఇవి

మన ఆరోగ్యంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడే  మొక్కలు, చెట్లు ఎన్నో ఉన్నాయి. కొన్ని మొక్కలతో మనం ఇంట్లోకి ఒక్క ఈగ రాకుండా చేయొచ్చు. అవి ఏమేమి మొక్కలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


లావెండర్ మొక్క

లావెండర్ మొక్క నుంచి వచ్చే సువాసన చాలా బాగుంటుంది. ఈ వాటన మీ ఇంటికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును కీటకాలను తరిమికొట్టడంలో ఈ మొక్క చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బాల్కనీలో లావెండర్ మొక్కను నాటితే మీ ఇంట్లోకి ఒక్క ఈగ కూడా రాదు. అలాగే మీ ఇళ్లు కూడా అందంగా కనిపిస్తుంది. 
 


బంతిపూల మొక్క

చాలా మంది గార్డెన్ లో బంతిపూల మొక్కను ఖచ్చితంగా నాటుతుంటారు. బంతిపూలు అందంగా ఉంటాయి. వీటిని దేవుడి పూజకు, ఇంటి అలంకరణకు బాగా ఉపయోగిస్తుంటారు. ఈ పువ్వులు గార్డెన్ ను అందంగా చేయడంతో పాటుగా మనకు ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవును ఈ మొక్కలుంటే ఆ చుట్టుపక్కలకు ఒక్క ఈగా కూడా రాదు. ఈ మొక్కలు కీటకాలను తరిమికొడతాయి. బంతిపూలు ఏడాది పొడవునా పూస్తాయి. 

lemon grass

లెమన్ గ్రాస్

లెమన్ గ్రాస్ ను టీ రుచిని పెంచడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కను పెంచడానిక మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే దీనిని తక్కువ స్థలంలో కూడా పెంచొచ్చు. ఈ లెమన్ గ్రాస్ మన ఆరోగ్యానికే కాదు.. కీటకాలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఉంటే మీ ఇంట్లోకి ఈగలు వచ్చే అవకాశమే లేదు. 
 

రోజ్మేరీ

రోజ్మేరీ మొక్కలు దోమలు, ఈగలు, ఇతర కీటకాలను రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. రోజ్మేరీ ఒక మొక్క. దీని వాసన ఈగలు, దోమలు రెండింటినీ ఇంటి నుండి దూరంగా ఉంచుతుంది.
 

click me!