చాలా మంది ఇండ్లలో బొద్దింకలు ఉంటాయి. ఇవి ఎక్కువగా బాత్ రూం, కిచెన్ రూముల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి మనం చూడగానే లోపలికి వెళ్లిపోతుంటాయి. ఈ బొద్దింకలు వంటింట్లో ఆహారాలు, పానీయాలను పాడు చేస్తాయి. వీటిని పొరపాటున కూడా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి బొద్దింకలను ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులను మనం బిర్యానీతో పాటుగా చాలా వంటల్లో వేస్తుంటాం. ఇవి ఫుడ్ ను టేస్టీగా, మంచి వాసన వచ్చేలా చేస్తాయి. అయితే ఈ ఆకులను ఉపయోగించి బొద్దింకలను ఇంట్లో నుంచి వెళ్లగొట్టొచ్చు. అవును బొద్దింకలను వదిలించుకోవడానికి బిర్యానీ ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు బిర్యానీ ఆకులను గ్రైండ్ చేసి వేడినీటిలో మిక్స్ చేసి వంటగదిలో స్ప్రే చేయండి.
లవంగాలు
బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి మీరు లవంగాలను కూడా ఉపయోగించొచ్చు. మీ వంటింట్లో బొద్దింకలు ఉన్నట్టైతే వాటిని తరిమికొట్టడానికి మీ వంటగదిలో 8-10 లవంగాలను అక్కడక్కడ పెట్టండి. వీటి వాసనకు బొద్దింకలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బొద్దింకలను వదిలించుకోవడానికి ఇది సులభమైన మార్గం.
Cockroaches
బేకింగ్ సోడా
బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి కూడా బేకింగ్ సోడా కూడా చాలా ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి కొద్దిగా చక్కెర మిక్స్ చేయండి. దీన్ని వంటగదిలో మొత్తం స్ప్రేతో స్ప్రే చేయండి.
cockroaches
కిరోసిన్
మీరు బొద్దింకలతో విసిగిపోతే కిరోసిన్ ను వాడి వాటిని ఇంట్లో నుంచి బయటకు పంపొచ్చు. దీనికోసం మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. కిరోసిన్ ను స్ప్రే బాటిల్ లో పోసి బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేయండి చాలు. దీనివల్ల కూడా ఇంట్లో ఒక్క బొద్దింక ఉండదు.