ఇలా మాట్లాడితే మీకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

First Published | Feb 22, 2022, 12:41 PM IST

ఎదుటి వారిని ఆకర్షించాలంటే మీ వాక్ చాతుర్యం బావుండాలి. మీరు మాట్లాడే విధానమే.. వారు మీతో మాట్లాడాలా? లేదా? అనేది డిసైడ్ చేస్తుంది. అందులోనూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ పెదాలపై నవ్వు మాయం కాకూడదు. అప్పుడే వారు మీతో ఇంకా ఎక్కువ సమయం మాట్లాడితే బాగుంటుందనుకుంటారు.

ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు మన మాట చాలా మృదువుగా ఉండాలి. అదే వారిని ఇంకా ఎక్కువ సమయం మనతో మాట్లాడేలా చేస్తుంది. అందులోనూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడితే వారు మన పట్ల ఆకర్షితులవుతారు. 
 

మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారు మన వాయిస్ బేస్ ను కూడా గమనిస్తారు. అందుకే వారికి నచ్చే విధంగా మృదువుగా మాట్లాడాలి. మీ వాయిస్ వారిని ఇంప్రెస్ చేయాలి. ఇకపోతే ఎదుటివారితో ఎలా ఆకర్షణీయంగా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 


మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ బేస్ హై పిచ్, లో పిచ్ అలాగే వాయిస్ డెప్త్ ఎదుటివారిని ఆకర్షించేలా ఉంటాయి. ఇలా మాట్లాడితే ఎదుటివారు మీ ప్రేమలో పడిపోతారు తెలుసా.. అందులోనూ మాట్లాడేటప్పుడు తత్తరపాటుకు గురికాకూడదు. ఏ విషయాన్నైనా సూటిగా, అందంగా, కాన్ఫిడెంట్ గా మాట్లాడితే ఎలాంటి వారైనా మీకు ఫిదా అవ్వాల్సిందే. 

ఒక వ్యక్తి ఎంత అందంగానైనా ఉండని.. అతను గనుక సరిగ్గా మాట్లాడకపోతే మాత్రం అవతలి వారికి మీరు ఎన్నటికీ నచ్చరు. కాబట్టి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పడు మీ మాటలు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉండేలా చూసుకోండి.

నెమ్మదిగా మాట్లాడండి: ఎదుటివారికి మీరు చెప్పేది అర్థం కావాలన్నా, వారు మీతో ఎక్కువ సేపు మాట్లాడాలనుకున్నా మీరు నెమ్మదిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పీడ్ గా మాట్లాడితే వారికేదీ అర్థం కాదు. పైగా వీడితో మాట్లాడటం దండగ అని అక్కడినుంచి వెళ్లిపోవడానికి సిద్దమైపోతుంటారు. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నెమ్మదిగా, అర్థమయ్యే విధంగా మాట్లాడండి. అప్పుడే ఎదుటివారు మిమ్మల్ని తొందరగా అర్థం చేసుకుంటారు. మీ స్నేహాన్ని కోరుకుంటారు.
 

మాట్లాడేటప్పుడు రిలాక్స్:  ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు వీలైనంత ప్రశాంతంగా మాట్లాడటానికి ట్రై చేయండి. కానీ ఏదో కొంపలు ముగిపోతున్నట్టు ఆగమాగం అయ్యి మాట్లాడితే మాత్రం ఎదుటివారు మీతో ఎందుకు మాట్లాడుతున్నానురా దేవుడా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్లతో వీలైనంత నిదానంగా, ప్రశాంతంగా మాట్లాడండి. మాటల మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండండి. అప్పేడే మీ వాయిస్ క్రాక్ అవకుండా ఉంటుంది. అలాగే మాటల మధ్యలో గట్టిగా శ్వాస తీసుకోండి. దీనివల్ల మీరు రిలాక్స్ అయ్యి Concentration‌ తో మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా దీనివల్ల మీ వాయిస్ వినసొంపుగా ఉంటుంది.
 

మృదువుగా: ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా అవసరం. మనం మృదువుగా మాట్లాడితే ఎదుటి వారు మనతో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. అంతేకాదు మీరు డయాఫ్రంతో మాట్లాడుతూ ఉంటే మీ వాయిస్ స్వీట్ గా వస్తుంది. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకోండి.
 

పదాలపై ధ్యాస: కొంతమంది మాటల మధ్యలో ఎదుటివారిని ఇబ్బంది పెట్టే పదాలను అనేస్తుంటారు. దీనికి కారణం వారు పదాలపై కాన్సంట్రేషన్ పెట్టకపోవడం వల్లే. అవి ఎదుటివారికి అస్సలు నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు పదాలపై ఏకాగ్రత ఉంచడం అవసరం. వారితో చెప్పాలనుకున్న వాటిని ప్రొనౌన్షియేషన్ చేసి మాట్లాడండి. అది చాలా మంచి పద్దతి. ఇలా మీరు కనుక మాట్లాడితే ఎదుటివారు పక్కాగా మీ మాటలకు ఫుల్ ఫిదా అవుతారు.   

Latest Videos

click me!