Mirror Cleaning: ఇంట్లోని అద్దాలపై పడిన మొండి మరకలను న్యూస్ పేపర్లతో క్లీన్ చేసేయండిలా

Published : Oct 01, 2026, 02:48 PM IST

Mirror Cleaning: ఇంట్లోని అద్దాలు, బాత్రూమ్ అద్దాలప నీటి మరకలు, ఇతర మరకలు పడుతూ ఉంటాయి. వాటిని తుడిచినా కూడా పోవు. అయితే కేవలం ఒక్క నిమిషంలో మీ అద్దం కొత్తదానిలా మెరిసిపోయేలా చేసే ఓ సింపుల్ మ్యాజిక్ ట్రిక్ ఇక్కడ చూద్దాం.

PREV
13
ఇంట్లోని అద్దాలను మెరిపించేయండిలా

ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలపై, బాత్రూమ్ లోని అద్దాలపై నీటి బిందువులు, సబ్బు నురగ, దుమ్ము పడి తెల్లటి మరకలు (Hard water stains) మారుతాయి. ఈ మరకల వల్ల అద్దం పూర్తిగా మసకబారి ముఖం సరిగ్గా కనిపించదు. క్లీన్ చేసినా కూడా ఆ మరకలు పోవు. చాలామంది అద్దాన్ని శుభ్రం చేయడానికి సాధారణ వస్త్రం లేదా టవల్ ఉపయోగిస్తారు. కానీ, బట్టతో తుడిస్తే దాని దారాలు (Lint), నీటి గీతలు అద్దంపైనే ఉండిపోతాయి. దీనివల్ల అద్దం మరింత మురికిగా కనిపిస్తుంది.

23
పాత పేపర్ చాలు

ఇంట్లోని మరకలు పడిన అద్దాన్ని శుభ్రం చేయడానికి ఖరీదైన గ్లాస్ క్లీనర్ స్ప్రేలు తీసుకురావాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో మూలన పడి ఉన్న పాత న్యూస్ పేపర్ ఉంటే చాలు. అద్దంపై ఉన్న మరకలను క్షణాల్లో మాయం చేయవచ్చు.

పాత న్యూస్ పేపర్‌లోని ఒక పేజీని తీసుకుని చేతిలో బంతిలా చుట్టండి.* ఈ పేపర్ బంతిపై మీరు కొద్దిగా నీళ్లు చల్లండి (తేలికగా తడవాలి, మరీ ఎక్కువగా కాదు). ఇప్పుడు ఈ తడి పేపర్‌తో అద్దంపై వృత్తాకారంలో (Circular motion) బాగా రుద్దండి.

33
న్యూస్ పేపర్ ఎలా పనిచేస్తుంది?

* న్యూస్ పేపర్ కాగితం దట్టమైన ఫైబర్లను కలిగి ఉంటుంది. ఇది దారాలను బయటికి వదిలేయదు. 
* అలాగే పేపర్ ప్రింటింగ్ కోసం వాడే ఇంక్ (Ink) నీటి జిడ్డును, గట్టి ఖనిజాల మరకలను కరిగించే సహజ గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే కేవలం 1 నిమిషంలో అద్దానికి కొత్త మెరుపు వస్తుంది.

తడి పేపర్‌తో తుడిచిన తర్వాత, మరో చిన్న పొడి పేపర్‌తో మీరు ఒక్కసారి తుడిస్తే చాలు. కేవలం 60 సెకన్లలో అద్దంపై ఉన్న మరకలన్నీ పూర్తిగా మాయమవుతాయి. మీ అద్దం షోరూమ్‌లోని కొత్త గ్లాస్‌లా తళతళా మెరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories