ఎండాకాలంలో ఇంట్లో చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Mar 29, 2024, 11:58 AM IST

ఎండాకాలంలో ఉదయం 9 తర్వాత నుంచి ఇంట్లో వేడిగా అనిపించడం మొదలవుతుంది. మధ్యాహ్నం సమయానికి వేడి మరింత ఎక్కువవుతుంది. ఫ్యాన్ గాలి కూడా వేడిగానే ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే చల్లగా ఉండేట్టు చేయొచ్చు. అదెలాగంటే?
 

summer

ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. బయటే కాకుండా ఇంట్లో కూడా ఈ సీజన్ లో వేడిగా అనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది ఈ సీజన్ లో ఆరుబయట చెట్టుకిందే ఎక్కువగా ఉంటుంటారు. కానీ సిటీల్లో ఎలా ఉండలేరు. కానీ ఎండగాలుల వల్ల ఇంట్లో వేడిగా ఉంటుంది. ఇంటి లోపల వేడి పొయ్యి మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఫ్యాన్ గాలి కూడా వేడిగానే అనిపిస్తుంది. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే  మాత్రం మీ ఇంటిని ఏసీలాగే చాలా చల్లగా ఉండేట్టు చూడొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కర్పూరం

ఇంటిని చల్లగా ఉంచేందుకు మీరు ఎన్నో రకాల ప్రయోగాలు చేయొచ్చు. వీటివల్ల మీకు ఎలాంటి హాని కూడా కలగదు. అయితే ఇంటిని చల్లగా ఉంచడానికి కర్పూరం మీకు బాగా సహాయపడుతుంది.  ఇందుకోసం దీనిని నీటిలో కలిపి  స్ప్రే బాటిల్ లో నింపి ఇంటి గోడలపై కొట్టండి. దీంతో మీ ఇల్లు చల్లగా ఉంటుంది. 
 

Latest Videos


rose water

రోజ్ వాటర్ 

సాధారణం రోజ్ వాటర్ ను అందానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. రోజ్ వాటర్ చర్మాన్ని అందంగా, మచ్చలు లేకుండా చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ దీనిని ఉపయోగించి మీరు మీ ఇంటిని చల్లగా కూడా ఉంచొచ్చు. ఇందుకోసం మీరు రోజ్ వాటర్ ను నీటిలో మిక్స్ చేసి ఇంటి లోపలి గోడలకు స్ప్రే చేయండి. దీనివల్ల ఇల్లు చల్లగా ఉండటమే కాకుండా ఇల్లంతా మంచి వాసన కూడా వస్తుంది. 
 

మట్టి కుండలో మొక్క

చాలా మందికి మొక్కలను పెంచడమంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే చిన్న బాల్కనీ ఉన్నా ఎన్నో రకాల మొక్కలను పెంచుతుంటారు. నీడలో పెరిగే మొక్కలు కూడా మనకు ఎన్నో అందుబాటులో ఉంటాయి. అయితే మట్టికుండలో పెట్టిన మొక్కతో కూడా మీరు మీ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. అవును ఈ మొక్క మీ ఇంటిని కూల్ గా ఉంచుతుంది. 
 

ఫ్రిజ్ ఆఫ్ చేయండి

ఎండాకాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ నే ఎక్కువగా తాగుతుంటారు. ఫ్రిడ్జ్ వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అందుకే బయటకు వెళ్లొచ్చినప్పుడు ఖచ్చితంగా కూల్ వాటర్ ను తాగుతుంటారు. అయితే ఎండాకాలంలో అప్పటికే ఇల్లు వేడిగా ఉంటుంది. అందుకే ఇలాంటి టైంలో మీరు ఫ్రిజ్ ను ఆన్ చేస్తే ఇల్లు మరింత వేడి అవుతుంది. అందుకే కొన్ని ఈ సీజన్ లో పగటిపూట కొన్ని గంటల పాటు ఫ్రిజ్ ను ఆప్ చేయండి. 

curtain

లేత రంగు కర్టెన్

ఎండాకాలంలో ఇల్లు కూల్ గా ఉండాలంటే కిటికీలు, డోర్స్ కర్టెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల కర్టెన్లు వేడిని గ్రహించి ఇంటిని మరింత వేడిగా చేస్తాయి. కిటికీల కర్టెన్లు పలుచగా, ముదురు రంగులో ఉంటే వేడిని బాగా గ్రహిస్తాయి. అందుకే ఎండాకాలంలో కర్టెన్ బరువుగా, లేత రంగులో ఉంటే వచ్చే వేడి తగ్గుతుంది.

ఇంటి లోపల పొడి బట్టలు 

వానాకాలంలో చాలా మంది ఉతికిన బట్టలను ఇంట్లోనే ఆరేస్తుంటారు. అలాగే ఎండాకాలంలో కూడా ఉతికేసిన బట్టలను ఇంట్లోనే ఆరేయండి. దీనివల్ల మీ ఇల్లు చల్ల చల్లగా ఉంటుంది. 

click me!