మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా.? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్

Published : Jun 13, 2025, 05:23 PM IST

ఈ రోజుల్లో  పిల్లలు ఎక్కువ సమయం టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లకే పరిమితమవుతున్నారు. ఇది వారు పెద్దవారయ్యే నాటికి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PREV
17
స్క్రీన్‌లకే పరిమితం

ఈ రోజుల పిల్లలు ఎక్కువ సమయం టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లకే పరిమితమవుతున్నారు. ఇది వారు పెద్దవారయ్యే నాటికి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

27
శారీరక చురుకుదనం

చిన్ననాటి నుంచి శారీరక చురుకుదనం లేకుండా పెరుగుతున్న పిల్లల్లో భవిష్యత్తులో బరువు పెరగడం, ఫిట్‌నెస్ తగ్గిపోవడం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

37
తల్లిదండ్రులే రోల్ మోడల్స్‌

తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల ఆటపాటలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంట్లోనే కాకుండా, వారు క్రీడల అకాడమీలో చేరి శారీరక శ్రమ చేసేలా చేయాలి. తల్లిదండ్రులే మొదటిగా రోల్ మోడల్స్‌గా నిలబడి, పిల్లలతో కలిసి ఆటలు ఆడితే వాళ్ళలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది.

47
ఒక గంట శారీరక శ్రమ

పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలంటే కొన్ని స్మార్ట్ టిప్స్ ఉపయోగపడతాయి. ఉదాహరణకు, రోజూ కనీసం ఒక గంట శారీరక శ్రమకు ప్రోత్సహించడం, స్క్రీన్ ఫ్రీ ప్లే డేట్స్ ఏర్పాటు చేయడం, 20 నిమిషాల స్క్రీన్ టైమ్ తర్వాత 20 నిమిషాల శారీరక కదలిక జరగేలా అలారం సెట్ చేయడం లాంటి మార్గాలు ఉపయోగకరంగా ఉంటాయి.

57
భోజన వేళలు, నిద్ర సమయంలో

కుటుంబ సమయం, భోజన వేళలు, నిద్ర సమయంలో ఎటువంటి స్క్రీన్ ఉపయోగం లేకుండా నిబంధనలు అమలు చేయాలి. అలాగే, పిల్లలతో కలిసి ఆటలు ఆడడం ద్వారా వారిలో శారీరక శ్రమపై ఆసక్తి పెంచాలి.

67
స్క్రీన్ టైమ్‌ని అర్థవంతంగా

పిల్లలు ఏ కార్యక్రమాన్ని చూసారో ఆపై వారితో చర్చ జరిపితే స్క్రీన్ టైమ్‌ని అర్థవంతంగా మార్చవచ్చు. తల్లిదండ్రులే ముందుగా మొబైల్ పక్కన పెట్టి పిల్లలతో మమేకమవ్వాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను తాత్కాలికంగా పిల్లల మనోభావాలను నియంత్రించేందుకు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

77
అనారోగ్య సమస్యల్ని

ఈ మార్పులు చేపడితే, పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించి భవిష్యత్తులో అనారోగ్య సమస్యల్ని నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం.

Read more Photos on
click me!

Recommended Stories