విద్యుత్ బల్బును ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

First Published Apr 12, 2024, 4:16 PM IST

విద్యుత్ బల్బులను ఎక్కువగా క్లీన్ చేయరు. దీనివల్ల వాటికి దుమ్ము, ధూళి బాగా పట్టుకుని నల్లగా, మురికిగా కనిపిస్తాయి. అయితే వీటిని కొన్ని పద్దతుల్లో క్లీన్ చేస్తే కొత్తవాటిలా కనిపిస్తాయి. 
 

మనం ప్రతిరోజూ విద్యుత్ బల్బులు వాడుతాం. పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా వీటిని ఇండ్లల్లో, ఆఫీసుల్లో ఉపయోగిస్తుంటారు. బల్బులు సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తాయి. దీంతో వాటిని తీయాల్సిన అవసరం ఉండదు. కానీ దీనివల్ల బల్బులకు దుమ్ము, ధూళి అంటుకుని మురికిగా కనిపిస్తాయి. అయితే చాలా మందికి వీటిని ఎలా క్లీన్ చేయాలో తెలియక అలాగే వదిలేస్తారు. అయితే వీటిని సింపుల్ గా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


విద్యుత్ బల్బును ఎలా శుభ్రం చేయాలి

విద్యుత్ బల్బును శుభ్రం చేయడానికి ముందు మీరు స్విచ్ బోర్డు నుంచి బల్బులను ఆఫ్ చేయండి. ఇప్పుడు బల్బులను జాగ్రత్తగా తీయండి. ఒక గుడ్డతో బల్బును పట్టుకొని తీయండి. ఎందుకంటే బల్బులు ఆన్ లో ఉండటం వల్ల వేడిగా ఉంటాయి. దీన్ని అలాగే పట్టుకుంటే చేతులు కాలుతాయి. 
 

నిమిషాల్లో బల్బ్ ను శుభ్రం చేయడం ఎలా?

పొడి క్లాత్ సహాయంతో మీరు బల్పుబును శుభ్రం చేయాలి. చాలా మంది బల్బును హోల్డర్ నుంచి బయటకు తీసి శుభ్రం చేయరు. అయితే ఇలా అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు ఇలా చేస్తే హోల్డర్ దెబ్బతింటుంది. అలాగే బల్బు కిందపడి పగిలిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే బల్బులను ఎప్పుడూ కూడా పొడి గుడ్డతో పట్టుకుని శుభ్రం చేయాలి. 
 

ఎల్ఈడీ లైట్లు

ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లలో ఎల్ఈడీ లైట్లనే ఉపయోగిస్తున్నారు. ఇవి బల్బుల కంటే చాలా మెరుగ్గా ఉంటాయి.  కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా రాదు. అలాగే ఇంట్లో వేడిగా ఉండదు. ఈ బల్బులను శుభ్రం చేయడానికి పెద్దగా ఇబ్బంది కాదు. అందుకే మిగతా బల్బులకంటే ఎల్ఈడీ బల్బులను ఉపయోగించడమే మంచిది.

click me!