Covid Headache : కోవిడ్ లక్షణాలలో దగ్గు, జలుబు, అలసట, ఒళ్లు నొప్పులు, రుచి కోల్పోవడం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే తమకు వచ్చే తలనొప్పి కోవిడ్ వల్ల వచ్చిందా లేదా సాధారణంగా వచ్చిందా అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
Covid Headache : కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయనుకున్న సమయంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే వివిధ దేశాలు మళ్లీ కోవిడ్ ఆంక్షలను విధిస్తున్నాయి. మాస్కులను ధరించడం తప్పనిసరి కాదన్న రాష్ట్రాలే మళ్లీ మాస్కులను ధరించాలని తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుతం ఫోర్త్ వేవ్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
28
జన్యు ఉత్పరివర్తనలతో కూడిన కొత్త వైరస్ వేరియంట్లు ఇప్పుడు వ్యాధిని మరింత వ్యాప్తి చేస్తున్నాయి. వీటిలో చాలా మందిలో సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, అలసట, గొంతునొప్పి వంటివి కోవిడ్ లక్షణాలు.
38
అలాగే వాసన, రుచి కోల్పోవడం, జీర్ణ సమస్యలు, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ వల్ల కలిగే కోవిడ్ సంక్రమణ లక్షణాల్లో తలనొప్పి ప్రధాన లక్షణం. కోవిడ్ కేసుల్లో తలనొప్పి సమస్య గుర్తించబడుతూనే ఉంది. ఈ తలనొప్పి కూడా కరోనా సంక్రమణ మొదటి లక్షణాల్లో ఒకటి. అయితే ఈ తలనొప్పి రోగనిర్దారణ చేయడానికి కూడా సహాయపడుతుంది.
48
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ కూడా తలనొప్పే. ఇది ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పిని పోలి ఉంటుంది. ఇలాగైతే మరి ఈ తలనొప్పిని గుర్తించడం కష్టమవుతుంది.
58
అయితే తలనొప్పి దేనివల్ల వచ్చిందో చెప్పడం కష్టమంటున్నారు వైద్యులు. కోవిడ్ తలనొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంది. కోవిడ్ తలనొప్పి నుదురు అంతటా వ్యాపిస్తుంది. అలాగే కళ్ల చుట్టూరా కూడా వ్యాపించి తల వెనుక భాగానికి చేరుకుంటుంది. ఈ నొప్పి తట్టుకోలేనంతగా ఉంటుంది. ఇవన్నీ టెన్షన్ వల్ల కలిగే తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని పోలి ఉంటాయి.
68
కోవిడ్ తలనొప్పి మైగ్రేన్ నొప్పిని పోలి ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారాల తరబడి కోవిడ్ తలనొప్పి వేధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
78
కోవిడ్ తలనొప్పి సాధారణంగా ఏడు రోజుల పాటు ఉంటుంది. ఇంకొంతమందిలో ఇది ముప్పై రోజుల వరకు ఉంటుంది. మరి కొంతమందిలో అయితే ఈ తలనొప్పి మూడు నెలల వరకు ఉంటుంది.
88
కోవిడ్ లక్షణాలను నిర్దారించుకున్న తర్వాతే అది కోవిడ్ తలనొప్పా లేదా వేరేదా అని నిర్దారించుకోవాలని నిపుణులు తేల్చి చెబుతున్నారు.