collagen
వయసు పెరుగుతున్న కొద్దీ మనం ముసలిగా కనిపించడం మొదలుపెడతాం. అంటే చర్మం చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీనికి కారణం మన శరీరంలో కొల్లాజెన్ తగ్గడమే. మన శరీర ప్రోటీన్ లో కొల్లాజెన్ 30% ఉంటుంది. ఇది మన చర్మానికి, ఎముకలకు, కండరాలకు చాలా అవసరం.
కొల్లాజెన్ మన చర్మాన్ని నిర్మించి బలంగా చేస్తుంది. అయితే 25 ఏండ్లు దాటిన తర్వాత శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. అయితే సమతుల్య ఆహారం తింటే మీ వయసు కనిపించదు. ఎక్కువ వయసు ఉన్నా.. చిన్న ఏజ్ వాళ్లలాగే కనిపిస్తారు. అందుకే కొల్లాజెన్ ను పెంచే కొన్ని రకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బెర్రీలు
బెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఒక కప్పు బెర్రీలను తింటే ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు. ఇందుకోసం మీరు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలలో దేనినైనా తినొచ్చు.
చేపలు
చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిని తినడం వల్ల మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉంటాం. చేపల ఎముక, చర్మం, నెత్తిమీద చాలా కొల్లాజెన్ ఉంటుంది. వీటిని తింటే మన ముఖంపై ముడతలు అస్సలు ఏర్పడవు.
గుడ్డు
గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. రెగ్యులర్ గా గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి దీన్ని మీ డైట్ ప్లాన్ లో చేర్చుకోండి. గుడ్డును తింటే మీరు ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు.
చికెన్
చికెన్ ఆడవాళ్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖంపై ఉండే సన్నని గీతలు, ముడతలను తగ్గించుకోవడానికి కూడా చికెన్ సహాయపడుతుంది. అందుకే 39 ఏండ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు తప్పనిసరిగా చికెన్ తినాలని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి
వెల్లుల్లి ఒక మసాలా దినుసు మాత్రమే కాదు.. పోషకాలతో నిండిన దివ్య ఔషధం లాంటిది కూడా. దీన్ని రెగ్యులర్ గా ఉదయం పూట తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ తగ్గే అవకాశం ఉండదు. ఇది కూడా మీరు యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.
ఆకుకూరలు
ఆకుకూరల్లో మినరల్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. శరీరంలో కొల్లాజెన్ కూడా బాగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని యంగ్ గా ఉంచుతుంది.