కీళ్ల నొప్పులు, వాపు తగ్గాలంటే.. శరీర బరువును తగ్గించాల్సిందే.. ఇందుకోసం ఏం చేయాలంటే..?

Published : Dec 31, 2022, 03:56 PM ISTUpdated : Dec 31, 2022, 03:58 PM IST

శరీర బరువు మరీ ఎక్కువగా ఉండటం వల్ల కీళ్లపై అదనపు బారం పడుతుంది. ఇది కాస్త కీళ్లనొప్పులకు, వాపునకు దారితీస్తుంది. అందుకే కీళ్ల నొప్పులతో బాధపడేవారు బరువును నియంత్రణలో  ఉంచుకోవాల్సి ఉంటుంది. 

PREV
16
 కీళ్ల నొప్పులు, వాపు తగ్గాలంటే.. శరీర బరువును తగ్గించాల్సిందే.. ఇందుకోసం ఏం చేయాలంటే..?

కీళ్ల నొప్పులు, వాపుతో రోజు వారి పనులను కూడా సరిగ్గా చేసుకోలేరు. దీనివల్ల సరిగ్గా నడవడం, కూర్చోవడం, పడుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కీళ్ల నొప్పులను పూర్తిగా వదిలించుకోవడం కష్టమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవడం. నిజానికి బరువు వల్ల కూడా కీళ్లపై అదనపు బారం పడుతుంది. ఇది కాస్త నొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది. మీకు తెలుసా? ఈ వ్యాధి పెరుగుతున్న కొద్దీ ఎముక,  మృదులాస్థి క్షీణించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల నొప్పులను భరించడం కష్టమవుతుంది. 
 

26

ఆర్థరైటిస్ ను తగ్గించడానికి బరువు తగ్గడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం ఆర్థరైటిస్ కు శత్రువని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అదనపు బరువు మీ ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. ఏదేమైనా ఆర్థరైటిస్ రోగులకు ముందే శరీర నొప్పులు, వాపు, అలసట వంటి సమస్యలు వస్తాయి. వీటివల్ల వల్ల మీరు ఇతరుల్లా కిలోల బరువు తగ్గడం చాలా చాలా కష్టం. కానీ వీళ్లు బరువు తగ్గితే కీళ్లపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అలాగే చలనశీలత మెరుగుపడుతుంది. నొప్పి తగ్గుతుంది. అలాగే మీ కీళ్ళకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్థరైటిస్ పేషెంట్లు ఎలా బరువు తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

క్రాష్ డైటింగ్ నివారించండి

క్రాష్ డైటింగ్ అంటే మరేమీ లేదు.. దీనిలో పూర్తిగా కేలరీలను తగ్గించాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనివల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కాదు. స్వల్పకాలిక విధానాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.  వీటి నుంచే ఫలితాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. నిజానికి ఈ క్రాష్ డైటింగ్ వల్ల జీవక్రియ రేటు బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ప్రేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాదు ఇది చివరికి శరీరంలో మంటను కలిగిస్తుంది. 
 

46

అడపాదడపా ఉపవాసం

అడపాదడపా ఉపవాసం ఆర్థరైటిస్ పేషెంట్లు సులువుగా బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మీరు మీరు 16 గంటలు ఉపవాసం ఉండి.. ఆపై 8 గంటలు తినడం అన్న మాట. ఈ ఉపవాసం సమయంలో మీ శరీరానికి ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి సమయం లభిస్తుంది. ఇది మంటను తగ్గిస్తుంది కూడా.
 

56

ఆటో ఇమ్యూన్ ప్రోటోకాల్ డైట్:

దీనిలో ప్రధానంగా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి. అలాగే మంటను తగ్గించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి,  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే కూరగాయలు, మాంసం ఉంటాయి. అంతేకాదు ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. 
 

66

తగినంత నీరు, పోషకహారాలు

ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వాళ్లు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినాలి. ఎందుకంటే ఇది భావోద్వేగ ఆహారం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల వీరు మరింత బరువు పెరిగిపోతారు. ఆర్థరైటిస్ రోగులు బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి, కండరాల అలసటను తగ్గించడానికి రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలి. 

click me!

Recommended Stories