వేప పేస్ట్.. దీన్ని ఉపయోగించి ఇంట్లో నుండి ఎలుకలు, ఇతర కీటకాలను సులభంగా తరిమికొట్టవచ్చు. వేప ఆకుల చేదు కారణంగా, ఎలుకలు కొన్ని రోజుల్లో ఇంట్లో నుండి శాశ్వతంగా పారిపోతాయి. దాని కోసం ఏం చేయాలంటే..
ముందుగా మిక్సీలో 1-2 కప్పుల వేప ఆకులను వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్రలో పేస్ట్ ఉంచండి. దీని తరువాత, ఈ పేస్ట్‌లో బియ్యం లేదా రోటీని వేసి బాగా మెత్తగా చేయాలి.
వేప ముద్దను మెత్తగా నూరిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంటి మూలల్లో పెట్టుకోవాలి.
మీరు ఈ బాల్స్ ని కారు లోపల కూడా ఉంచవచ్చు. ఒక్కసారి తిన్నాక ఎలుకలు ఆ ప్రదేశానికి వెళ్లవు.