దేవుడికి పూజ చేసే సమయంలో చేయకూడని తప్పులు ఇవే..!

First Published | Apr 18, 2024, 3:25 PM IST

 దాదాపు చాలా మంది తెలియక పూజ సమయంలో తప్పులు  చేస్తూ ఉంటారు.  ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా  తెలీదు. అయితే.... ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం...
 


సనాతన ధర్మాన్ని అనుసరించి మనం దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు.  దేవుడికి నిత్య పూజలు చేసేవారు కూడా ఉంటారు. అయితే.. ఎక్కువగా.. ఏదైనా పెద్ద పూజ, వ్రతం లాంటివి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు.. పవిత్రమైన తేదీ, సమయం చూసుకొని మరీ చేసుకుంటూ ఉంటారు. మంచి ముహూర్తంలో పూజ చేస్తే... శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు. అయితే.. మంచి ముహూర్తం చూసుకోగానే సరిపోదు. మనం చేసే పూజా విధానం కూడా చాలా ముఖ్యం. దాదాపు చాలా మంది తెలియక పూజ సమయంలో తప్పులు  చేస్తూ ఉంటారు.  ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా  తెలీదు. అయితే.... ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం...

vastu pooja room


పూజ సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూడాలి. అది కూడా.. నైవేద్యం  ఎప్పుడూ సాత్విక ఆహారమే ఉండాలా శ్రద్ధ తీసుకోవాలి.
 అంతేకాదు...దేవునికి నైవేద్యంగా పెట్టే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, వంటగదిని పూర్తిగా శుభ్రం చేయండి. అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి. మీరు పూజ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంటే, ఎల్లప్పుడూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి స్వామికి నైవేద్యాన్ని సిద్ధం చేయండి.
 


V

నైవేద్యం ఏ పాత్రలో చేయాలి..?
నైవేద్యం తయారు చేసే పాత్ర కూడా చాలా ముఖ్యం.  ఇది బంగారం, వెండి, రాగి లేదా ఇత్తడితో చేయాలి. మీకు కావాలంటే, మీరు మట్టి లేదా చెక్క పాత్రలలో భోగ్‌ను అందించవచ్చు, కానీ మీరు అల్యూమినియం, ఇనుము, స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలలో నైవేద్యం సమర్పించకూడదు. ఈ పాత్రల్లో సమర్పించడం.. అంత శుభం కాదు.
 


ప్రసాదం సమర్పించిన తర్వాత ఆలయంలో ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ప్రసాదం సమర్పించిన తర్వాత, దానిని కుటుంబ సభ్యులకు పంచాలి. ప్రసాదం  సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు , అదృష్టాన్ని పొందవచ్చు.

Latest Videos

click me!