ఇంట్లో ఎలుకలు ఒక్కటి కూడా ఉండకూడదంటే ఇలా చేయండి

First Published | Nov 2, 2024, 4:52 PM IST

చాలా మంది ఇళ్లలో ఎలుకలు విపరీతంగా ఉంటాయి. ఈ ఎలుకల వల్ల ఇళ్లు మురికిగా మారడమే కాకుండా..వీటివల్ల లేనిపోని రోగాలు కూడా వస్తాయి.రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోంచి ఎలుకలను ఎలా వెళ్లగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలుకలను తరిమికొట్టే చిట్కాలు

చాలా మంది ఇండ్లలో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల ఇల్లంతా మురికిగా మారడమే కాకుండా.. లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఎలుకలు ఇంట్లో క్రిములను వ్యాపింపజేయడమే కాకుండా.. మురికిగా కూడా మారుస్తాయి.

అలాగే ఇవి ఇంట్లో న్న ముఖ్యమైన పేపర్లు, బుక్కులు, వస్తువులు, బట్టలు, సోఫాలను కొరికి నాశనం చేస్తాయి. చాలా మంది ఎలుకలను పట్టుకోవడానికి ఎలుకల బోను ఉపయోగిస్తారు. కానీ ఎలుకలు ఎక్కువగా ఉంటే మాత్రం వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. 

ఎలుకలను తరిమికొట్టడానికి ఇంటి చిట్కాలు

మీ ఇంట్లో కూడా ఎలుకలు మరీ ఎక్కువగా ఉంటే.. వాటిని చాలా సులువుగా ఎలా వెళ్లగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఎలుకలను తరిమికొట్టడానికి ఇంటి చిట్కాలు

ఇంటి నుండి ఎలుకలను తరిమికొట్టడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

1. మిరియాల నూనె

కిచెన్ లేదా బెడ్ రూమ్ ఇలా ఇంట్లో ఏ చోట ఎలుకలు ఉన్నా.. వాటిని సులువుగా తరిమికొట్టడానికి మిరియాల నూనెను ఉపయోగించండి. ఎందుకంటే ఎలుకలకు మిరియాల ఘాటైన వాసన అస్సలు నచ్చదు. ఇందుకోసం కొన్ని వాటర్ లో పది చుక్కల మిరియాల నూనెను కలిపి స్ప్రే బాటిల్ లో నింపండి.

దీన్ని ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో బాగా స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల ఆ ఘాటైన వాసన ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తుంది. 

2. పటిక బెల్లం

అవును పటిక బెల్లంతో కూడా ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేయొచ్చు. ఎందుకంటే పటిక బెల్లం వాసన కూడా ఎలుకలకు అస్సలు నచ్చదు.ఇందుకోసం పటిక బెల్లాన్ని బాగా దండి పొడి చేయండి. దీన్ని ఎలుకలు ఉండే ప్రదేశాల్లో చల్లండి. 

ఈ పొడిని పీల్చిన వెంటనే ఎలుకలు ఇంట్లో ఒక్కటి కూడా లేకుండా పోతాయి. ఒకవేళ  పటిక బెల్లం లేకపోతే కర్పూరాన్ని అచ్చం ఇలాగే ఉపయోగించినా ఎలుకలు ఉండవు. ఎందుకంటే కర్పూరం వాసన కూడా ఎలుకలకు నచ్చదు. 

ఎలుకలను తరిమికొట్టడానికి ఇంటి చిట్కాలు

3. ఎండుమిరపకాయల పొడి

మిరియాలతో కూడా ఇంట్లో ఒక్క ఎలుక లేకుండా పోతుంది. ఈ మిరియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మిరియాల పొడిని ఎలుకలు ఉండే చోట చల్లితే ఎలుకలు పారిపోతాయి. ఈ మిరియాల పొడి వాసన కూడా ఎలుకలకు నచ్చదు. 

4. వెల్లుల్లి

వెల్లుల్లి  ప్రతి వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. మనం వెల్లుల్లిని ఉపయోగించి కూడా ఇంట్లో ఉన్న ఎలుకలను తరిమికొట్టొచ్చు. ఎందుకంటే వెల్లుల్లి వాసన ఎలుకలకు వాసన నచ్చదు. ఇందుకోసం వెల్లుల్లిని బాగా దంచండి. దీన్ని నీళ్లలో కలిపి ఎలుకలు నివసించే ప్రదేశాల్లో చల్లండి. ఈ వాసనకు ఎలుకలు అక్కడ లేకుండా పోతాయి. 

ఎలుకలను తరిమికొట్టడానికి ఇంటి చిట్కాలు

5. ఉల్లిపాయ

ఉల్లిపాయ కూడా ఎలుకలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు తెలుసా? ఎలుకలను తరిమికొట్టడానికి ఉల్లిపాయ ఒక మంచి ఆయుధం. ఎందుకంటే ఉల్లిపాయ వాసన కూడా ఎలుకలకు ఏ మాత్రం నచ్చదు. కాబట్టి దీన్ని ముక్కలుగా కోసి ఎలుకలు తిరిగే ప్రదేశంలో ఉంచండి. అక్కడికి ఎలుకలు అస్సలు రావు. 

6. లవంగాల నూనె 

లవంగాల నూనెను ఉపయోగించి కూడా మీరు మీ ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేయొచ్చు. దీనికోసం ఒక గుడ్డలో లవంగాల నూనెను చల్లుండి. ఆ తర్వాత దానిని ఎలుకలు దాక్కునే ప్రదేశాల్లో ఉంచండి. దీని వాసనకు ఎలుకలు వెంటనే మీ ఇంట్లో నుంచి పారిపోతాయి.

Latest Videos

click me!