చలికాలంలో చేతులు పొడిబారుతున్నాయా? మృదువుగా కావాలంటే అమ్మమ్మ చిట్కాలను ఫాలో అవ్వండి..

Published : Nov 18, 2022, 01:55 PM IST

చలికాలంలో చర్మం పొడిబారడం చాలా కామన్. ఈ డ్రైనెస్ ను పోగొట్టడానికి చాలా మంది వివిధ కోల్డ్ క్రీములను, రకరకాల మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తుంటాయి. కానీ అమ్మమ్మల కాలం నాటి చిట్కాలను పాటిస్తే మీచేతులు.. నునుపుగా.. అందంగా తయారవుతాయి. 

PREV
16
 చలికాలంలో చేతులు పొడిబారుతున్నాయా? మృదువుగా కావాలంటే అమ్మమ్మ చిట్కాలను ఫాలో అవ్వండి..

చలికాలంలో వాతావరణం చాలా తేమగా ఉంటుంది. దీనివల్ల మన చర్మం పొడిబారుతుంది. చల్లని వాతావరణంతో పాటుగా.. వాతావరణ కాలుష్యం వల్ల ప్రస్తుతం చాలా మంది చర్మం పొడి బారి నిర్జీవంగా కనిపిస్తుంటుంది. నిజానికి గాలి ప్రభావం తక్కువగా ఉంటే చర్మం ఆరోగ్యం, అందంగా ఉంటుంది. కానీ శీతాకాలంలో గాలుల ప్రభావం నుంచి చేతులను అందంగా ఉంచుకోవడం కష్టమే. చలికాలంలో చేతులు  చాలా పొడిబారుతాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే పొడిబారడాన్ని తగ్గించొచ్చు. అలాగే చేతులను మృదువుగా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

కలబంద

కలబంద జెల్ మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం ముడతలను తొలగిస్తాయి. అయితే చర్మం లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుంది. కలబంద జెల్ ను చేతులకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే.. చేతులు పొడిబారడం తగ్గుతుంది. 
 

 

36

ఓట్స్

చలికాలంలో చర్మం పగిలిపోతుంది. దీనివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ చర్మ సమస్యను తొలగించడానికి మీకు ఓట్స్ బాగా ఉపయోగపడుతుందది. ఇందుకోసం ఓట్స్ పౌడర్ ను తీసుకుని నీటిలో మిక్స్ చేసి స్క్రబ్ లా చేతులకు రాయండి. ఐదు నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేయండి. దీనివల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మీ చేతులకు గ్లిజరిన్ లేదా కొబ్బరి నూనెను రాయండి. దీనివల్ల కొత్త చర్మం తేమగా ఉంటుంది. 
 

46

తేనె

మనం వాడే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో తేనె ఖచ్చితంగా ఉంటుంది. చలికాలంలో తేనె మన చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ సీజన్ లో చేతులకు తేనెను రాస్తే పగుళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. చేతులు  అందంగా,  మృదువుగా మారతాయి కూడా. ఇందుకోసం తేనె చేతులకు రాసాక.. కాసేపు మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీళ్లతో నీట్ గా కడిగేయండి. తేనే మన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే డ్రైనెస్ ను పోగొడుతుంది. 
 

56

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె మన జుట్టుకే కాదు చర్మానికి, ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది చలికాలంలో చర్మానికి ఖచ్చితంగా కొబ్బరినూనెను రాస్తుంటారు. కొబ్బరి నూనె మన చర్మానికి పోషణనున అందిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ పడుకునే ముందు చేతులకు కొబ్బరినూనెను రాసి కాసేపు మసాజ్ చేయాలి. దీనివల్ల చేతులు పొడిబారడం తగ్గిపోతుంది. దీనివల్ల మీరు ఎలాంటి లోషన్ గానీ క్రీం గానీ పెట్టాల్సిన అవసరం రాదు. 
 

66

వాసెలిన్, గ్లిసరిన్

వాసెలిన్, గ్లిసరిన్ లు రెండూ సహజ ఉత్పత్తులు. ఇవి చర్మం పొడిబారడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు వాసెలిన్ లేదా గ్లిసరిన్ లను చేతులకు రాసుకోవాలి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.  
 

Read more Photos on
click me!

Recommended Stories