ఒక మనిషిని చూడగానే ఆకట్టకునేది.. వారి మనసులోని భావాల్ని పట్టించేవి.. వారిమీద మనకొక అభిప్రాయాన్ని ఏర్పడేలా చేసేవి.. ముఖంలోని కళ్లు. అందమైన కళ్లు మీ ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని.... మీరు ఎలాంటి వారు అనే దాన్ని చెప్పకనే చెబుతాయి.
ఇంత అందమైన కంటికి మరింత అందాన్నిచ్చేవి మాత్రం కనుబొమ్మలే. ఈ కనుబొమ్మలు నాట్యం చేస్తాయి. అనేక భావాలు పలికిస్తాయి. విల్లులా వంగుతాయి. నెలవంకలా కుంగుతాయి. ప్రశ్నిస్తాయి. కొంటె భావాలు విసురుతాయి. మందపాటి కనుబొమ్మలు కొత్త అందాన్నిస్తాయి. అందుకే కనుబొమ్మలను రకరకాలుగా షేప్ చేసుకుంటారు. విల్లులా, గుండ్రంగా, పైకి లేచినట్టుగా ఇలా ముఖానికి తగ్గట్టుగా తీర్చి దిద్దుకుంటారు.
మరి అందంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న కనుబొమ్మలు పలుచగా ఉంటే ఏం బాగుంటాయి. అందుకే ఒత్తైన కనుబొమ్మలు ఇచ్చే అందం కోసం.. తీర్చి దిద్దినట్టుండాలని ఐబ్రో పెన్సిల్ వాడడం కూడా తెలిసిందే. అయితే ఇలాంటివి కాకుండా సహజంగానే కనుబొమ్మలు ఒత్తగా ఉండాలంటే.. అందంతో మెరిసిపోవాలంటే కొన్నిరకాల నూనెలను తరచుగా కనుబొమ్మల మీద రాస్తుండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
దీనికోసం కొబ్బరినూనె మంచిదని చాలామంది చెబుతారు. కొబ్బరినూనె జుట్టుకు ఎంతో మంచిది. పోషకాలను అందిస్తుంది. అయితే మరికొంతమంది కనుబొమ్మల కోసం ఆలివ్ ఆయిల్ చాలా మంచిదని చెబుతుంటారు. అయితే వీటిని వాడడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టం లేపోవడంతో మీరు మీ వీలును బట్టి దేన్నైనా వాడొచ్చు.

ఒత్తైన కనుబొమ్మల కోసం ఇంట్లోనే ఈజీగా ఆయిల్ రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలి. ఏఏ పదార్థాలు కావాలనేది ఇప్పుడు చూద్దాం. కనుబొమ్మలకు ప్రత్యేకమైన ఈ నూనెకోసం రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కాస్ట్రాల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ అవసరం పడతాయి.
ఆలివ్ ఆయిల్, కాస్ట్రాల్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ లను ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు తయారైన ఈ మిశ్రమాన్ని ఓ శుభ్రమైన గాజు జార్ లోకి తీసుకోవాలి. మూత గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఈ నూనెను తరచుగా కనుబొమ్మలకు అప్లై చేయాలి. ఇలా నెలరోజుల పాటు చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒత్తైన, నల్లని, నిగనిగలాడే కనుబొమ్మలు మీ సొంతమవుతాయి.