వాస్తులో ఈ మార్పులు.. ఉద్యోగంలో దూసుకుపోతారంతే...

First Published | Aug 14, 2021, 11:32 AM IST

లాక్ డౌన్ మానసిక, శారీరక స్థితిగతులను బాగా దెబ్బతీసింది. దీనికి తోడు ఉద్యోగాలు కోల్పవడం తీవ్ర ఒత్తడిని కలిగించింది. కెరీర్ ఆగిపోవడం, నిరుద్యోగం ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి వాస్తు పరంగా కొన్ని చిట్కాలను పాటిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. దీనికోసం చేయాల్సిన చిన్నచిన్న మార్పులతో 5 చిట్కాలను చెబుతున్నారు. 

కరోనా మహమ్మారి మీ ఉద్యోగాన్ని ఊడగొట్టిందా? మీరు ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? కెరీర్ లో అద్భుతమైన ఎదుగుదల కోసం వేచి చూస్తున్నారా? అయితే దీనికి చక్కటి పరిష్కారం వాస్తు పరంగా కొన్ని మార్పులు చేయడమే. ఉద్యోగాల్లో మీ ప్రయత్నాలతో పాటు వాస్తు పరంగా కొన్నిరకాల మార్పులు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులుగా మారిపోయారు. లాక్ డౌన్ మానసిక, శారీరక స్థితిగతులను బాగా దెబ్బతీసింది. దీనికి తోడు ఉద్యోగాలు కోల్పవడం తీవ్ర ఒత్తడిని కలిగించింది. కెరీర్ ఆగిపోవడం, నిరుద్యోగం ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి వాస్తు పరంగా కొన్ని చిట్కాలను పాటిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. దీనికోసం చేయాల్సిన చిన్నచిన్న మార్పులతో 5 చిట్కాలను చెబుతున్నారు. 

Latest Videos


మీరు వర్క్ చేసుకుంటున్నట్లైతే.. దానికోసం ల్యాప్ టాప్ లు, స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లైతే వాటిని ఏ దిశలో పెడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను ఆగ్నేయ మూలలో ఉంచడం కెరీర్ వృద్ధికి మంచిది. దీంతోపాటు ఫోన్, లాప్ టాప్ కు వాడే కేబుల్స్ అటాచ్ చేసి ఉండకూడదు. టేబుల్‌టాప్‌మీద కనిపించకుండా చూసుకోవాలి.

ఇక పనిచేసేటప్పుడు మీరు కూర్చునే విధానం కూడా మీ కెరీర్ వృద్ధి మీద ప్రభావితం చూపిస్తుంది. ఆఫీసులో అయితే ఎత్తైన కుర్చీలో, నిటారుగా కూర్చోవడం వల్ల కెరీర్ లో మంచి ఎదుగుదల ఉంటుంది. మరికొంతమంది కుర్చీలో బాసింపట్టు వేసుకుని కూర్చుంటారు. వర్క్ ఫ్రం హోం సమయంలోనూ ఇలా కూర్చోవడం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది అస్సలు మంచిది కాదు. ఇలా కాళ్లు ముడుచుకుని కూర్చోవడం మీ కెరీర్ వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు సరైన క్రమశిక్షణతో పనిచేయడం కెరీర్ లో ఎదుగుదలకు కీలకం.

ప్రస్తుత పాండమిక్ టైంలో ఎంతోమంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇది అతి సాధారణ విషయంగా మారిపోయింది. ఇలా ఇల్లే ఆఫీసు అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పనిచేసే ప్లేస్ బెడ్ రూంలోనో, బెడ్ కి దగ్గరగానో ఉండకుండా చూసుకోండి. మీరు కూర్చునే డెస్క్ కూడా చతురస్రాకారంగానో/దీర్ఘచతురస్రంగానో ఉండాలి. రౌండ్ గా ఉండే డెస్కులకు దూరంగా ఉండడమే మంచిది. 

ఇక మీ డెస్క్ మీద.. లేదా వర్క్ కు దగ్గర్లో పవర్ ఫుల్ క్రిస్టల్స్ పెట్టుకోవాలి. దీనివల్ల వీటినుంచి అధిక శక్తి విడుదలై అది మీ పనిమీద ప్రభావం చూపిస్తుంది. మీరు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆఫీసులో కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మీ డెస్క్ మీద బాంబు మొక్కను ఉంచడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

వాస్తు ప్రకారం, నిద్రించేటప్పుడు తల తూర్పు వైపు పెట్టడం వల్ల మంచి కెరీర్ వృద్ధిని ఉంటుంది. ఇది ఏకాగ్రత స్థాయిలను మెరుగుపరుస్తుంది. మెరుగైన మానసిక శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇక కూర్చుని పనిచేసేప్పుడు ఉత్తర దిశలో కూర్చొని పనిచేయడం మంచిది. మీ వీపుకు వెనకభాగంలో గోడ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీరు స్థిరంగా ఉంటారు. మీరు పని చేయడానికి కూర్చున్న ప్రదేశం వెనుక భాగంలో కిటికీ ఉండకూడదు. దానివల్ల  గందరగోళానికి గురి చేస్తుంది. పరధ్యానంలో పడే అవకాశం ఉంటుంది. 

అయితే, దేనికైనా నమ్మకం ప్రధానం. అందుకే యూనివర్స్, మాజిక్ మీద నమ్మకం ఉంచండి. మనస్పూర్తిగా ఈ చిట్కాలను పాటించండి. తొందర పడొద్దు. ప్రశాంతంగా ఉండండి. ఏ వాస్తు చిట్కా అయినా.. మీ ఎదుగుదలనే సూచిస్తుంది. అంతిమంగా మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. 

click me!