ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా పొగాకు, ఆల్కహాల్ వినియోగాలను పూర్తిగా తగ్గించాలి. ఇవి ఊబకాయం, హైపర్ టెన్షన్ కు ప్రధాన కారకాలు. కూరగాయలు, తాజా పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. ఇవి హైబీపీ సమస్యను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.