నారింజలతో అందం రెట్టింపు.. ఎలా ఉపయోగించాలంటే..!

First Published Jun 4, 2023, 2:50 PM IST

నారింజ సిట్రస్ పండు. ఇది మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు మొటిమలు, మచ్చలు అంటూ ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది తెలుసా? 
 

orange

నారింజ ఒక సీజనల్ పండు. ఈ పండ్లలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు మరెన్నో వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. ఈ పండు మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అవేంటంటే.. 

Image: Getty Images

మొటిమలను తగ్గిస్తుంది

నారింజ పండ్లలో  సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అలాగే అధిక ఆయిల్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం జిడ్డుగా, మొటిమల బారిన పడినప్పుడు ఆరెంజ్ మాస్క్ లు బాగా ఉపయోగపడతాయి. ఇవి మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి.
 

orange peel

నేచురల్ గ్లోని జోడిస్తుంది

నారింజల ఫేస్ మాస్క్ లను ఎక్కువగా ఉపయోగిస్తే మీ చర్మం మరింత అందంగా మారుతుంది. నారిజం చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా ఎన్నో చర్మ సంరక్షణ చికిత్సలలో ఉపయోగిస్తారు. 

స్కిన్ హైడ్రేషన్

నారింజలోని యాంటీఆక్సిడెంట్ సామర్ధ్యం మమన చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. అలాగే నిర్జీవమైన, నీరసమైన చర్మం తిరిగి రిఫ్రెష్ గా మారుతుంది. 
 

చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది

ఎండబెట్టిన నారింజ తొక్కలను గ్రైండ్ చేసి ముల్తానీ మిట్టి, తేనె కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ఫేస్ మాస్క్ ఉపయోగించొచ్చు. ఈ ఫేస్ మాస్క్ ను కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మురికిని, చనిపోయిన కణాలను తొలగిస్తుంది. 

చర్మాన్ని పునరుత్తేజపరుస్తుంది

నారింజ తొక్కలు సూర్యుడి హానికరమైన యువి కిరణాల నుంచి చర్మాన్ని కూడా రక్షిస్తాయి. ఎందుకంటే నారింజ తొక్కల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 
 

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది

 బ్లాక్ హెడ్స్ ను వదిలించుకోవడానికి ఎక్స్ ఫోలియేషన్ అవసరం. ఎందుకంటే అవి నూనె,  చనిపోయిన చర్మ కణాలతో నిండి ఉంటాయి. ఆరెంజ్ పీల్ పౌడర్ ను ఉపయోగించడం ద్వారా బ్లాక్ హెడ్స్ ను వదిలించుకోవచ్చు.

click me!