Healthy Heart: గుండె జబ్బులు రాకూడదంటే.. మీ శరీరంలో ఈ పోషకాలను తగ్గనివ్వకండి..

First Published Aug 15, 2022, 4:32 PM IST

Healthy Heart: గుండెపైనే మన లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ రోజులు కొట్టుకునేలా చూడాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే గుండె హెల్తీగా ఉంటుంది. దీనిలైఫ్ టైం కూడా పెరుగుతుంది. 

కొన్ని ఏండ్ల నుంచి దేశవ్యాప్తంగా హార్ట్ పేషెంట్స్ సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. ఆయిలీ ఫుడ్స్, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల ఈ గుండె జబ్బులు మరింత ఎక్కువ అవుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఈ ఫుడ్స్ కు గుడ్ బాయ్ చెప్పేసి.. హెల్తీ పుడ్స్ ను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఇవి ఏయే ఆహారాల్లో ఉంటాయంటే.. 

వాల్ నట్స్

వాల్ నట్స్ మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం, రాగి, విటమిన్ ఇ తో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను పెంచుతాయి. అందుకే వీటిని వేసవిలో ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

సోయాబీన్

సోయాబీన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటుగా ఒమేగా 6 ఫ్యాటీ  యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పీచుపదార్థాలు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. 

అవిసె గింజలు

గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవిసెగింజల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు  వీటిలో విటమిన్ సి, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

చేపలు

చికెన్, మటన్ కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. తరచుగా సాల్మన్ చేపలను తింటే మీ శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి5, పొటాషియం, ప్రోటీన్ , మెగ్నీషియం వంటి పోషకాలు అందుతాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

గుడ్డు

గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజుకు రెండు ఉడకబెట్టిన గుడ్లను తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. 
 

click me!