ఏం చేసినా ఒత్తిడి తగ్గడం లేదా.. అయితే ఈ నూనెను తలకురాయండి వెంటనే ఉపశమనం పొందుతారు..

Published : Sep 27, 2022, 03:00 PM IST

ఒత్తిడి ఒక మానసిక సమస్య. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడి మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది. అందుకే ఒత్తిడిని చాలా తొందరగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.   

PREV
17
 ఏం చేసినా ఒత్తిడి తగ్గడం లేదా.. అయితే ఈ నూనెను తలకురాయండి వెంటనే ఉపశమనం పొందుతారు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో ఒత్తిడి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఉద్యోగం కోల్పోవడం, అప్పులు, నష్టాల్లో వ్యాపారం, కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు, పనిలో టెన్షన్ వంటివి ఒత్తిడికి కారణమవుతాయి. ఒత్తిడి ఒక వ్యక్తిని ఒంటరివాడిని చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యల్లోకి నెట్టేస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
 

27

ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. తగినంత నిద్ర పోవాలి. ఈ నియమాలను తూ.చ తప్పకుండా పాటిస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 
 

37

ఒత్తిడి సమస్య నుంచి ఉపశమనం  కలిగించడానికి మీకు పుదీనా నూనె బాగా ఉపయోగపడుతుంది. పుదీనా నూనెలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే సామర్థ్యం ఉందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. ఇందుకోసం పుదీనా నూనె ఎలా ఉపయోగడపడుతుందో తెలుసుకుందాం పదండి. 
 

47

 

పుదీనా మొక్కను ఆయుర్వేదంలో దివ్య ఔషదంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కడుపునకు సంబంధించిన రుగ్మతలను తొలగించడానికి పుదీనా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని ఎన్నో రకాల ఉపయోగించి ప్రయోజనాలను పొందవచ్చు. 

57

జీర్ణవ్యవస్థ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పుదీనా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పుదీనా ఆకులతో చట్నీ చేసుకుని తినొచ్చు. ఈ పుదీనా ఆకుల్లో ఉండే మెంతోల్ ఒత్తిడిని చాలా తర్వగా తగ్గిస్తుంది. 

67

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పుదీనా నూనెతో మీ జుట్టును మసాజ్ చేయండి. తలకు పుదీనా నూనెను అప్లై చేయడం వల్ల ఒత్తిడి నుంచి చాలా త్వరగా బయటపడతారు. ఇది మీరు రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి కూడా సహాయపడుతుంది. 
 

77

అంతేకాదు..  పుదీనా నూనె వాసన కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వాసన మెదడులోని హ్యాపీ హార్లోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి మీరు ఒత్తిడితో బాధపడుతుంటే.. పుదీనా నూనెను ఉపయోగించండి. మంచి ఫలితాలను పొందుతారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories