ఉదయం లేవగానే ఫోన్ చూస్తారా? డౌటే లేదు ఆ సమస్యలున్నట్టే మీకు..

First Published Feb 2, 2024, 3:27 PM IST

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు మన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ ను వాడుతూనే ఉంటాం. కానీ ఫోన్ ను లిమిట్ కు మించి వాడితే లేనిపోని రోగాలొచ్చే ప్రమాదం ఉంది. 

తిండి తిప్పలు లేకున్నా.. ఫోన్ ఒక్కటి ఉంటే చాలు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. మీరు గమనించారో లేదో.. ఫోన్ కూడా మన జీవనశైలిలో ఒక భాగమైపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ లను వాడటం మొదలు పెట్టరు. స్కూల్, కాలేజ్ లేదా ఆఫీసు పని లేదా తమను తాము ఎంటర్టైన్ చేసుకోవడానికి ఫోన్లను యూజ్ చేస్తున్నారు. నిజానికి ఫోన్ వాడటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఫోన్ అవసరానికి వాడితేనే బాగుంటుంది. అవసరం మించి ఉపయోగిస్తే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. ఫోన్ లో ఎక్కువ సేపు గడపడం వల్ల మీరు సమాజానికి దూరమవుతారు. సంబంధాలు కూడా బలహీపడతాయి. 

ఒకప్పుడు ఉదయం లేవగానే అరచేతులనో, దేవుడి ఫోటోలను చూసేవారు. కానీ ఇప్పుడు లేవగానే ఫోన్ లనే చూస్తున్నారు. ఏమేం నోటిఫికేషన్లు వచ్చాయంటూ ఫోన్ ను స్క్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ ఉదయం లేవగానే ఫోన్లను ఉపయోగించే అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


తలనొప్పి

ఉదయం కళ్లు తెరవగానే మీరు ముందుగా మొబైల్ ఫోన్ నే వాడితే మీ మెటబాలిజం మందగిస్తుంది. అలాగే తలనొప్పితో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అలవాటు మీ శరీరంపై చెడు ప్రభావాలను చూపిస్తుంది. 

ఒత్తిడిని పెంచుతుంది

ఉదయాన్నే మొబైల్ ఫోన్ చెక్ చేసే వారిలో మీరూ ఒకరైతే.. ఇది మీ ఒత్తిడిని ఖచ్చితంగా పెంచుతుంది. అవును ఉదయం నిద్రలేవగానే ఎన్నో రకాల సమాచారాలను ఫోన్ ద్వారా తెలుసుకోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు. పని, సోషల్ మీడియా లేదా వార్తల గురించి నిరంతర నవీకరణలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది మిమ్మల్ని రోజంతా ఒత్తిడికి గురిచేస్తుంది. 
 

మెదడు పనితీరు ప్రభావితం 

నిద్రలేచిన వెంటనే మీ ఫోన్ ను చెక్ చేయడం వల్ల మీ అభిజ్ఞా పనితీరుకు ఆటంకం కలుగుతుంది. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఎన్నో నోటిఫికేషన్లను చూడటం వల్ల మీ అప్రమత్తత ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది మీ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది

కళ్లపై ఒత్తిడి 

బ్రైట్ నెస్ ఎక్కువగా పెట్టుకుని ఉదయాన్నే ఫోన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల మీ కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మీకు అసౌకర్యం, తలనొప్పి, కళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయి. ఇది మీ కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మెటబాలిజం

సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ మీ జీవక్రియను ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి తలనొప్పికి కారణమవుతాయి. అలాగే మీ శక్తి స్థాయిలు, జీవక్రియను ప్రభావితం చేస్తాయి.
 

click me!