వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడాన్ని నోక్టురియా అంటారు. అయితే ఈసమస్య 50 ఏండ్ల వారికంటే తక్కువ వయసు ఉన్నవారికి ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే ఇది కొన్ని వ్యాధులకు సంకేతం. అతి చురుకైన మూత్రాశయం (OAB),ప్రోస్టేట్ కణితులు, మూత్రపిండాల సంక్రామ్యత, మూత్రాశయం, డయాబెటీస్, దిగువ కాలు వాపు, ఆందోళన, అవయవ వైఫల్యం, రోలాజికల్ డిజార్డర్, మూత్రనాళ సంక్రామ్యత వల్ల తరచుగా మూత్రం వస్తుంది.