పండుగ కదా అని డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినకండి.. లేదంటే బరువు పెరగడంతో పాటుగా ఆ సమస్యలు కూడా వస్తయ్..

First Published Oct 23, 2022, 4:08 PM IST

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటివల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అలా అని మరీ ఎక్కువగా తింటే బరువు పెరగడంతో పాటుగా ఎన్నో సమస్యలు కూడా వస్తాయి.
 

దీపావళి సందర్భంగా చాలా మంది స్వీట్లతో పాటుగా డ్రై ఫ్రూట్స్ ను కూడా బంధువులకు, స్నేహితులకు బహుమతిగా ఇస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. డ్రై ఫ్రూట్స్ ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అలా అని మరీ ఎక్కువగా తింటే ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా.. 


డ్రై ఫ్రూట్స్ అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

జీర్ణ సంబంధ వ్యాధులు: జీడిపప్పు, బాదం, పిస్తా , వాల్ నట్స్ వంటి గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయినప్పటికీ వీటిని అతిగా అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. ఈ గింజల్లో ఫైటేట్లు , టానిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటివల్లే కడుపు ఉబ్బరం వస్తుంది. ఈ గింజల్లో ఉండే కొవ్వు కారణంగా విరేచనాలు కూడా అవుతాయి.
 

బరువు పెరుగుతారు: బరువు తగ్గేందుకు డ్రై ఫ్రూట్స్ ఎంతో సహాయపడతాయి. అందుకే చాలా మంది వీటిని తింటుంటారు. ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుంటాయి. ఇవి మీరు ఎక్కువగా తినకుండా ఉండటానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఈ రెండు చాలా చాలా అవసరం. కానీ వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. 
 

చక్కెర ఎక్కువగా ఉంటుంది: ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో కేలరీలు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే పండుగ సీజన్ లో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా ఎండు ద్రాక్షలను మోతాదుకు మించి తినకూడదు.

ఫుడ్ పాయిజన్: కొన్ని రకాల విత్తనాలను మితంగానే తీసుకోవాలి. ఎందుకంటే వీటిని అతిగా తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ముఖ్యంగా బ్రెజిలియన్ విత్తనాలు, జాజికాయ, బాదం పప్పులను ఎక్కువగా అసలే తినకూడదు. బ్రెజిలియన్ విత్తనాలను నమలడం వల్ల సెలీనియం ఎక్కువ అవుతుంది. అయితే బాదంలో హైడ్రోసైయోనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడానికి దారితీస్తుంది.

అలెర్జీ : కొన్ని రకాల గింజలను తింటే అలెర్జీ కూడా వస్తుంది. ఈ అలెర్జీలు వేర్వేరు వ్యక్తులలో భిన్నంగా ఉంటుంది. కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, వికారం మొదలైన సమస్యలు కనిపిస్తాయి. అందుకే డ్రై మీ శరీరానికి ఏ డ్రై ఫ్రూట్స్ పడవొ వాటిని తినకండి. 

click me!