BeautyTips: నేటి కాలుష్య వాతావరణం లో ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య జుట్టు రాలటం. అయితే ఈ సమస్యకి జామ ఆకుల ద్వారా నివారణ ఉంది అంటున్నారు నిపుణులు అదేంటో చూద్దాం.
జుట్టు అందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. జుట్టు రాలిపోతున్నా, బట్టతల వచ్చినా చాలామంది కుమిలిపోతుంటారు. బట్ట తలపై మళ్ళీ జుట్టు మొలిపించుకునేందుకు కొందరు డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతూ ఉంటారు.
26
ఆడవాళ్ళని ఈ సమస్య మరింత ఆత్మన్యూనత కు గురిచేస్తుంది. కేవలం జుట్టు ట్రీట్మెంట్ కోసమే పెద్దపెద్ద సెలూన్ లు కూడా నగరాల్లో కనిపిస్తున్నాయి అంటే జుట్టుకు ప్రాధాన్యం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
36
అయితే అంత ఖర్చు పెట్టకుండా సులువుగా ఇంట్లోనే జుట్టు పెరిగే మార్గాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం. అవునండి మన పెరట్లో ఉండే జామ చెట్టు ఆకులు మన జుట్టుకి దివ్య ఔషధం అని చాలామందికి తెలియకపోవచ్చు.
46
కానీ నిజంగా నిజం. జామాకులు కొన్ని తీసుకొని నీళ్లలో బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత వాటిని జుట్టు కుదురులకి బాగా పట్టించండి ఒక పది నిమిషాల పాటు మసాజ్ లాగా చేయండి. నాలుగు ఐదు గంటలు దానిని అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయండి.
56
లేదంటే రాత్రి తలకు పట్టించి ఒక టవల్ తలకి చుట్టుకొని పొద్దున లేచిన తర్వాత తల స్నానం చేయండి. ఊడిపోయిన జుట్టుని తిరిగి రప్పించడంలోనూ.. ఉన్న జుట్టును రాలనీయకుండా చూడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఖరీదైన సెలూన్ లకు వెళ్లి డబ్బులు వదిలించుకోవడం కన్నా ఈ రెమిడిని పాటించి చూడండి.
66
మీ జుత్తు పెరుగుదలని మీరే గమనిస్తారు. దానితోపాటు జుట్టు రాలకుండా తెగులు జాగ్రత్తలు కూడా తీసుకోండి అంటే ఎప్పుడు తలంతా పొడిగా ఉండేలాగా చూసుకోండి వెడల్పు అయిన దువ్వెనతో మాత్రమే చిక్కులు తీసుకోండి. అలాగే ఘాడత తక్కువగా ఉన్న షాంపూలను మాత్రమే ఉపయోగించండి.