ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.. ఇది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి కావొచ్చు..

First Published Nov 17, 2022, 1:59 PM IST

సిఓపిడి లేదా క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. స్మోకింగ్, వాయు కాలుష్యం, పని ప్రాంతాలు, ఇండ్ల నుంచి వచ్చే పొగ, విష వాయువులు, ధూళి కణాలు, రసాయనాలు, బాల్యంలో ఊపిరితిత్తులలో అంటువ్యాధులు, వంశపారంపర్య కారకాలు సిఓపిడి వ్యాధికి కొన్ని ప్రధాన కారణాలు.

ఇలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. పరిస్థితి మరింత దిగజారొచ్చు. మీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించొచ్చు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే సిఓపిడి లక్షణాలను నియంత్రించవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధిని మరింత దిగజార్చడంలో ఈస్ట్రోజెన్ కూడా పాత్ర పోషిస్తుంది. అయితే మెడిసిన్స్, ఆక్సిజన్ థెరపీ మొదలైన వాటి ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధి పురుషులను మాత్రమే కాదు.. మహిళలను కూడా చాలా ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్సతో లక్షణాలను నియంత్రిస్తే.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు. 
 

సిఓపిడి లేదా క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. స్మోకింగ్, వాయు కాలుష్యం, పని ప్రాంతాలు, ఇండ్ల నుంచి వచ్చే పొగ, విష వాయువులు, ధూళి కణాలు, రసాయనాలు, బాల్యంలో ఊపిరితిత్తులలో అంటువ్యాధులు, వంశపారంపర్య కారకాలు సిఓపిడి వ్యాధికి కొన్ని ప్రధాన కారణాలు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి.. వాటిని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దీర్ఘకాలిక దగ్గు

సిఓపిడి ఉన్న వ్యక్తుల్లో దీర్ఘకాలిక దగ్గు ఉంటుంది. ఇలాంటి వారు రోజంతా దగ్గుతూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో సాధారణంగా..  దగ్గు 4 నుంచి 8 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఇది సిఓపిడి ప్రారంభ  సంకేతం. ఇలాంటి సమస్య  కనిపిస్తే వెంటనే చెక్ చేసుకోవడం మంచిది. 
 

పసుపు లేదా ఆకుపచ్చ కఫం

ఈ ఊపిరితిత్తుల వ్యాధిలో శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వ్యాధిలో అధిక శ్లేష్మం రెండో లక్షణం. ఈ శ్లేష్మం పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే.. మీ ఊపిరితిత్తులకు కొంత ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోండి. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఈ వ్యాధిలో మూడో లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఎక్కువ సేపు నడిచినా లేదా మెట్లు ఎక్కినా.. మీరు బాగా అలసిపోతారు. రోజంతా మీరు  అలసిపోయినట్లుగా భావించడం ఊపిరితిత్తుల బలహీనతకు సంకేతం.

త్వరగా బరువు తగ్గుతారు 

ఈ ఊపిరితిత్తుల వ్యాధిలో నాల్గొ లక్షణం చాలా త్వరగా బరువు తగ్గడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా మీరు చాలా త్వరగా బరువు తగ్గడం మొదలు పెడతారు. ఇవన్నీ సిఓపిడి ప్రారంభ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే హాస్పటల్ కు వెళ్లి చెక్ చేసుకోవడం మర్చిపోకండి.

click me!