సాయంత్రం కాఫీ తాగితే బరువు పెరుగుతారా?

First Published Sep 25, 2022, 4:56 PM IST

అలసటను, ఒత్తిడిని తగ్గించడానికి కాఫీ బాగా పనిచేస్తుంది. అందుకే ఆఫీసుల్లో పనిచేసేవారు తరచుగా కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీకి బాగా అలవాటు పడిన వారు చాలా మంది రోజుకు 6 నుంచి 8 కప్పుల దాకా తాగుతుంటారు. అయితే కాఫీ నిజంగా బరువు పెంచుతుందా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా? 

కప్పు కాఫీతోనే డే ను స్టార్ట్ చేస్తారు చాలా మంది. కాఫీని తాగడం వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అందుకే ఆఫీసుల్లో పని చేసేవారు, ఇతర పనులను చేసే చాలా మంది రోజుకు ఐదారు కప్పులు లాగిస్తుంటారు. కానీ రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక కొంతమంది బరువు పెరిగిపోతామని కాఫీని తాగడం మానేస్తారు. ముఖ్యంగా సాయంత్రం పూట కాఫీని తాగితే ఖచ్చితంగా బరువు పెరిగిపోతారని భావిస్తారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం పదండి. 
 

కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతారా?

కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే  కెఫిన్ ను మోతాదుకు మించి తీసుకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. ముఖ్యంగా సాయంత్రం వేళ కాఫీని తాగడం వల్ల శరీర జీవక్రియ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఇది కాస్త బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే చాలా మంది సాయంత్రం వేళ కాఫీని తాగడానికి వెనకాడుతారు.
 

డైటీషియన్ నవనీత్ గుప్తా ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాఫీ తాగితే.. ఆరోగ్యానికి మంచిది. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత కాఫీని తాగితే  జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే సాయంత్రం వేళ ఆలస్యంగా కాఫీ తాగితే మెటబాలిజం నెమ్మదిస్తుంది. ఇదే బరువు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 
 

సాయంత్రం ఎంత కాఫీ తాగడం మంచిది ?

ఒకవేళ మీకు సాయంత్రం వేళ కాఫీని తాగే అలవాటుంటే ఒక కప్పు కంటే ఎక్కువ అంటే 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో తాగకండి. ఎందుకంటే సాయంత్రం 6 తర్వాత కాఫీని తాగితే రాత్రిళ్లు సరిగ్గా నిద్ర ఉండదు. తక్కువ నిద్ర బరువు పెరిగేందుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు కంట్రోల్ లో ఉండాలంటే కాఫీని ఎలా తీసుకోవాలి?

బ్లాక్ కాఫీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువును తగ్గించడానికి కూడా కూడా ఉపయోగపడుతుంది. వాస్తవానికి మిల్క్ కాఫీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ బ్లాక్ కాఫీనే తాగండి. బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. 

బరువు తగ్గేందుకు కాఫీని తాగుతున్నట్టైతే అందులో షుగర్ మిక్స్ చేయకండి. దీనికి బదులుగా కాఫీ లో బెల్లం లేదా తేనె లేదా బ్రౌన్ షుగర్ ను ఉపయోగించండి. ఇది మీ కాఫీని టేస్టీగా చేస్తుంది. హెల్త్ కి కూడా మంచిది. 

click me!