డయాబెటీస్ రాకూడదంటే ఇలా చేయండి

First Published Sep 25, 2022, 3:04 PM IST

ప్రతిరోజూ కొద్ది సేపు నడవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందులో ఒకటి మధుమేహం. షుగర్ పేషెంట్లు రెగ్యులర్ గా కాసేపు నడవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
 

చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా ఎంతో మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా మనదేశంలో  డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అయితే ఈ వ్యాధి అప్పటికప్పుడు వచ్చేది కాదు. అందుకే డయాబెటీస్ లక్షణాలు కనిపిస్తే.. ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం మీరు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేరు. మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే సరి.. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే కూడా డయాబెటీస్ అదుపులో ఉంటుంది. అవేంటంటే
 

మార్నింగ్ వాక్

నడక ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా నడక మధుమేహులకు మరింత ప్రయోజనకరంగా  ఉంటుంది. ఎందుకంటే ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. వేగంగా నడవడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే  ఇతర అనారోగ్య సమస్యలూ కూడా తగ్గుతాయి. ఒక వేళ మీకు ప్రీ డయాబెటీస్ ఉన్నట్టైతే వెంటనే మార్నింగ్ వాక్ చేయండి. దీనివల్ల మీరు మధుమేహం నుంచి బయటపడొచ్చు. ప్రతిరోజూ ఉదయం 20 నుంచి  25 నిమిషాలైనా నడవండి. 

ఏరోబిక్స్

ఏరోబిక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా 30 నిమిషాలైనా ఏరోబిక్స్ డ్యాన్స్ చేస్తే దీని ముప్పు నుంచి సులువుగా బయటపడతారు. అందుకే.. ఏరోబిక్ డ్యాన్స్ ను మరువకుండా చేయండి. 
 

సైక్లింగ్

సైక్లింగ్ వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజూ ఒక 20 నిమిషాలైనా సైక్లింగ్ చేయడం వల్ల మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. 

ప్రాణాయామం

ప్రాణాయామం  మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాదు.. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇందుకోసం 15 నుంచి 20 నిమిషాలైనా ప్రాణాయామం చేయాలి. శ్వాస వ్యాయామ, అనులోమ్, విలోమ్ ప్రాణాయామం వంటివి చేస్తే ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ గా ఈత కొడితే కూడా డయాబెటీస్ అదుపులో ఉంటుంది. 

click me!