Health Tips : ఈ చలికాలంలో ఒకవైపు దారుణంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు సీజనల్ గా అటాక్ చేసే వ్యాధులు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. అంతేకాదు ఇదే సమయంలో ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. వీటికి తోడు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. కాగా ఈ లక్షణాలు సీజనల్ గా వచ్చే వ్యాధులలో కనిపిస్తాయి. అలాగే కరోనా లక్షణాలలో ఇవి కూడా ఉన్నాయి. ఈ లక్షణాలే ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకుని అనుమానాల్ని తీర్చేసుకోవడం ఉత్తమం. అయితే దగ్గు, జలుబులు సీజనల్ గా వస్తే మాత్రం అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. లేదంటే ఆ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.