శరీరం బక్క పల్చగా ఉన్నవారికి అవిసె గింజలు, నువ్వులు, సోయా గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి. శరీరం సౌష్టవంగా తయారవ్వాలంటే ప్రతి రోజూ ఫ్రెష్ గా ఉండే పండ్లను తీసుకోవడంతో పాటుగా శరీరానికి అవసరమయ్యే నీటిని కూడా తాగుతూ ఉండాలి. అలాగే వేరు శెనగలు, బాదం పప్పు, ఆక్రోట్, పిస్తాలను కూడా రోజూ వారి ఆహారం లో చేర్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వీటితో పాటుగా మీగడ తీయని పెరుగు తీసుకుంటే కూడా శరీర బరువు పెరుగుతుంది. అలాగే వెన్న తీయని పాలు కూడా శరీర బరువును పెంచడంలో బాగా సహాయపడతాయి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.