వాకింగ్: క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాదు ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల బాడీలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో సమస్యలు మటు మాయం అవుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక అర్థగంట పాటు వాకింగ్ చేయడం వల్ల ప్రమాదకరకమైన క్యాన్సర్ జబ్బు నుంచి తప్పించుకోవచ్చు. కాగా ప్రతిరోజూ 100 నిమిషాల నడిస్తే శరీర బరువును కోల్పోవచ్చు. అంతేకాదు పాదాలకు ఎటువంటి చెప్పులు, షూస్ లేకుండా నడిస్తే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అంతేకాదు మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గడంతో పాటుగా, పొత్తి కడుపు నొప్పుల సమస్య, గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని పరిశోధనలు వెళ్లడిస్తున్నాయి.