vitamin b12: మానసిక, శారీరక ఆరోగ్యానికి విటమిన్ బి12 ఎంతో సహాయపడుతుంది. ఒకవేళ విటమిన్ బి12 లోపిస్తే నాడీవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇది ఎర్రరక్తకణాలు ఏర్పడటాన్ని కూడా తగ్గిస్తుంది. మరి ఈ విటమిన్ బి12 వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
విటమిన్ బి 12 వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్(Alzheimer's) ప్రమాదం నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
211
vitamin B 12
ఒకవేళల విటమిన్ బి -12 (vitamin b12) లోపిస్తే బొబ్బలు, డిప్రెషన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, నోటి సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ బి -12 మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పదండి.
311
విటమిన్ బి -12 ఆరోగ్య ప్రయోజనాలు.. విటమిన్ బి -12 శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి ఎంతో సహాయపడుతుంది.
411
గర్భధారణ సమయంలో విటమిన్ బి -12 తీసుకుంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడు( Brain) నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఎంతో సహాయపడుతుంది.
511
విటమిన్ బి -12 ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా బలంగా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
611
కంటిచూపు మందగించడం (Vision loss) వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి విటమిన్ బి -12 చాలా అవసరం. ఇది మాక్యులర్ క్షీణత వంటి కంటి వ్యాధులను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
711
విటమిన్ బి 12 మానసికి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia), డిప్రెషన్ (Depression), నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి 12 కీలక పాత్ర పోషిస్తుంది.
811
విటమిన్ బి -12 జీవక్రియ(Metabolism)ను పెంచడానికి , కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఊబకాయాన్ని కూడా తొలగిస్తుంది.
911
శరీరంలో శక్తిని నిర్వహించడానికి విటమిన్ బి -12 చాలా అవసరం. విటమిన్ బి12 మీరు బలంగా మారడానికి ఎంతో తోడ్పడుతుంది.
1011
విటమిన్ బి 12 గుండె జబ్బులను (Heart disease) రాకుండా మనల్ని కాపాడుతుంది. అవును ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
1111
జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ బి -12 అవసరం. ఇది హైపర్ పిగ్మెంటేషన్, గోరు రంగు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.