weight loss: గుడ్డు లేదా చికెన్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

Published : May 20, 2022, 12:07 PM IST

weight loss: కొంతమందికి నాన్ వెజ్ లేనిదే ముద్ద కూడా దిగదు. గుడ్డు లేదా చేపలు లేదా చికెన్ ఏదైనా ఒకటి ఉండాలని పట్టుపడతారు.  కానీ ఇలాంటి ఆహారాల వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బరువు తగ్గడానికి చికెన్ లేదా గుడ్డు ఏది బెస్టో తెలుసుకుందాం.   

PREV
18
weight loss: గుడ్డు లేదా చికెన్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

అధిక బరువుతో బాధపడేవారు కాదు మిగతా వారు కూడా రాత్రిపూట తేలికపాటి భోజనమే చేయాలని చాలా మంది నిపుణులు సలహానిస్తుంటారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. రాత్రిపూట, ఉదయం తేలికపాటి ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రిపైట కొంచెం ముందుగానే తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. అలాగే తేలికపాటి భోజనం వల్ల కేలరీలను చాలా తక్కువ మొత్తంలో తీసుకోగలుగుతారు. 

28
weight loss

మీరు పడుకునే సమయానికి రెండు గంటల ముందుగా భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరం నిల్వ చేసిన కొవ్వును శక్తి కోసం ఉపయోగించినప్పుడు..ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.

38

ఎండోక్రైన్ సొసైటీ యొక్క జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆహార-ప్రేరిత థర్మోజెనిసిస్ (డిఐటి) అనేది భోజన సమయాన్ని బట్టి మానవ జీవక్రియ ఎంత బాగా పనిచేస్తుందో కొలవడానికి కొలమానం. అల్పాహారంలో తీసుకునే భోజనంలో ఎన్ని కేలరీలు ఉన్నప్పటికీ..  డిన్నర్ కోసం వినియోగించిన అదే భోజనం కంటే రెండు రెట్లు ఎక్కువ ఆహార-ప్రేరిత థర్మోజెనిసిస్ను సృష్టిస్తుందని అధ్యయనం కనుగొంది. ఎక్కువ అల్పాహారం, విందులో తేలికపాటి ఆహారం యొక్క ప్రాముఖ్యతను ఈ అధ్యయనం కనుగొన్నది. 

48

గుడ్డు పోషక విలువలు.. గుడ్డు తక్కువ కేలరీల ఆహారం. ఒక గుడ్డులో కేవలం 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.5 గ్రాముల సంతృప్త కొవ్వు, ఇనుము, విటమిన్లు, ఖనిజాలు మరియు కెరోటినాయిడ్లు ఉంటాయి. సుమారు 85 గ్రాముల బరువున్న చికెన్ లో ఒక సర్వింగ్, 122 క్యాలరీలు, 24 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, కార్బోహైడ్రేట్లు మరియు నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ బి 12, రిబోఫ్లేవిన్ వంటి ఇతర ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి.

58

గుడ్డు లేదా  చెకెన్ ను బరువు తగ్గడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో తింటారు. ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం. అలాగే వండటం కూడా సులువే. 
 

68

గుడ్డు లేదా చెకెన్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ యొక్క సౌలభ్యం, మీ శరీరం దానిని ప్రాసెస్ చేసే విధానం, వండిన రెసిపీ రకాన్ని బట్టి గుడ్డు లేదా చికెన్ ను తినవచ్చు.
ఉదాహరణకు వేయించిన చికెన్ కంటే.. కూరగాయలతో చేసిన చికెనే మీ హెల్త్ కు మంచిది. ఇది జీర్ణక్రియకు మంచిది. కానీ స్టోర్ నుంచి కొన్న స్టోర్ రోటిస్సేరి చెకెన్ మంచిది కాదు. 
 

78

గుడ్లకు సంబంధించినంత వరకు ఇది మంచి ఆహారమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది దీన్ని తింటే విపరీతంగా బరువు పెరుగుతారని దీన్ని తినడానికి ఇష్టపడరు. కానీ గుడ్లు తక్కువ కార్బ్, తక్కువ కేలరీలు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రోటీన్ యొక్క మూలం. ఇది అద్భుతమైన ఆహార వనరుగా పని చేస్తుంది. కానీ గ్యాస్ట్రోసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు గుడ్డును తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుంది.
 

88

మరోవైపు గుడ్లలో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్, విటమిన్ డి చాలా మందిలో నిద్రను కలిగిస్తాయి. కాబట్టి, మీ శరీరం గుడ్లను ఎలా నిర్వహిస్తుందనే దానిపై ఆధారపడి, మీరు దానిని మీ ఆహారంలో చేర్చవచ్చు లేదా చేర్చకపోవచ్చు.

click me!

Recommended Stories