Published : Apr 22, 2022, 09:50 AM ISTUpdated : Apr 22, 2022, 09:51 AM IST
Memory Loss: వయసు మీద పడుతున్న కొద్ది మతిమరుపు రావడం చాలా కామన్. కానీ కొంతమంది చిన్న వయసులోనే మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. దీనికంతటికి కారణం వారి శరీరంలో విటమిన్ బి12 లోపించడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Memory Loss: వృద్ధాప్యంలో మతిమరుపు సమస్య రావడం సర్వ సాధారణ విషయం. కానీ ప్రస్తుత కాలంలో చిన్నవయసు వారు సైతం ఈ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చిన్న వయసులో మతిమరుపు సమస్య వచ్చిందంటే వారి శరీరంలో విటమిన్ బి12 లోపించిందని అర్థం చేసుకోవాలి.
27
విటమిన్ బి 12 యొక్క ప్రయోజనాలు: మనం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఎ, బి, సి, డి వంటివి ఎంతో అవసరం. వీటితో పాటుగా ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్ బి12 కూడా ఎంతో అవసరం. ఇవి మన శరీరంలో తగినంత మోతాదులో ఉండే ఎలాంటి వ్యాధులు కూడా మనల్ని చుట్టు ముట్టే సాహసం చేయలేవు. విటమిన్ బి12 మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పోషకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
37
శరీరంలో విటమిన్ బి12 ఎందుకు లోపిస్తుంది.. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాలను తినకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. HIV వంటి ప్రమాదకరమైన వ్యాధుల కారణంగా, శరీరంలో విటమిన్ B12 శోషణ సాధ్యం కాదు. అలాగే కొన్ని చెడు బ్యాక్టీరియా, శస్త్రచికిత్స, టేప్ వార్మ్ లు కూడా ఈ విటమిన్ లోపానికి కారణం కావొచ్చు.
47
విటమిన్ బి12 లోపం యొక్క లక్షణాలు..
1. మైకము కమ్మడం
2. ఆకలి లేకపోవడం
3. చర్మం పసుపు రంగులోకి లేదా మురికిగా మారుతుంది
4. తరచుగా మూడ్ మారుతుంది
5. అధిక ఒత్తిడి
6. ఎక్కువ అలసట
7. చేతులు, పాదాల్లో జదరింపులు
8. Rapid heartbeat
9. కండరాల బలహీనత
57
విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధులు..
1. జరిగిన విషయాలను మర్చిపోయి గందరగోళ జీవితంలో బతికే సమస్యలో చిక్కుకుపోవచ్చు.
2. ఎముకల్లో నొప్పి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
3. నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
4. శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేయడం కూడా కష్టంగా మారుతుంది.
67
విటమిన్ బి12 మన ఆరోగ్యానికి ఎందుకంత ముఖ్యమైనది..
1. విటమిన్ బి12 లోపం వల్ల మెదడు, నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
2. ముఖ్యంగా గర్భిణులకు విటమిన్ బి12 అత్యవసరం. ఇది లోపిస్తే చిత్తవైకల్యం వస్తుంది.
3. విటమిన్ బి12 లోపిస్తే కీళ్లు, ఎముకల్లో నొప్పి మొదలవుతుంది. అంతేకాదు రక్తహీనత ప్రమాదం కూడా పెరుగుతుంది.
4.శరీరంలో శక్తి ఉత్పత్తి అయ్యేందుకు విటమిన్ బి12 చాలా అవసరం.
77
విటమిన్ బి12 కోసం వేటిని తినాలి.. విటమిన్ బి12 లోపాలు మీలో కనిపించినట్టైతే మీ రోజు వారి ఆహారంలో కొన్నింటిని తప్పకుండా చేర్చుకోవాలి. అవేంటంటే..చీజ్, ఓట్స్, మిల్క్ బ్రోకలీ, పుట్టగొడుగులు, గుడ్డు, చేప, సోయాబీన్స్, పెరుగు.